ఎయిర్‌పోర్టుకు భూమిని అప్పగించిన అశ్వీనీదత్
గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూసమీకరణ ఊపందుకుంది. ప్రముఖ సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్… కేసరపల్లి పరిధిలోని తన 40 ఎకరాలను భూమిని ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు నూజివీడు ఆర్డీవో రంగయ్యకు అంగీకారపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మొదటి దఫా 417 ఎకరాలు సేకరించాల్సి ఉందని, ఇప్పటివరకు 171 ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారని చెప్పారు. సీఎం ప్రకటనతో రైతుల్లో ఉత్సాహం వచ్చి, లాండ్ పూలింగ్‌కు అనుకూలంగా ముందుకొస్తున్నట్లు తెలిపారు. చిన్న రైతులు […]
Advertisement
గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణకు భూసమీకరణ ఊపందుకుంది. ప్రముఖ సినీ నిర్మాత చలసాని అశ్వనీదత్… కేసరపల్లి పరిధిలోని తన 40 ఎకరాలను భూమిని ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు నూజివీడు ఆర్డీవో రంగయ్యకు అంగీకారపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మొదటి దఫా 417 ఎకరాలు సేకరించాల్సి ఉందని, ఇప్పటివరకు 171 ఎకరాలకు రైతులు అంగీకార పత్రాలు ఇచ్చారని చెప్పారు. సీఎం ప్రకటనతో రైతుల్లో ఉత్సాహం వచ్చి, లాండ్ పూలింగ్‌కు అనుకూలంగా ముందుకొస్తున్నట్లు తెలిపారు. చిన్న రైతులు అమ్ముకునే అవకాశం కూడా ఉందని, అలాంటి వారు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, అధిక పరిహారం ప్రకటించడంతో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. అందరికీ సమానంగా 1450 గజాలు ఇవ్వాలని ఇటీవల ఎమ్మెల్యే కోరడంతో సీఎం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే! మెట్ట, మాగాణి భూములు ఇచ్చేందుకు రైతులు భూసమీకరణకు ముందుకు వస్తున్నారు.
Advertisement