పంటల గిట్టుబాటు ధరకు కొత్త విధానం

ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు కల్పించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా కొత్త మార్కెటింగ్‌ పాలసీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించింది. దళారీ వ్యవస్థకు పుల్‌స్టాప్‌ పెట్టి, మార్కెట్‌కు పంటలు తెచ్చే రైతు గిట్టుబాటు ధరకే ఆ పంటను విక్రయించేలా ఆధునిక పద్ధతులను అమలు చేయనున్నారు. మార్కెటింగ్‌ చట్టాల్లో సంస్కరణలు తేవడం ద్వారా ‘ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మార్కెటింగ్‌ పాలసీ-2015’ను అన్వయం చేసుకుంటూ జీవోనెం.27ను తెచ్చారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి […]

Advertisement
Update:2015-06-06 18:33 IST
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు బహిరంగ మార్కెట్‌లో గిట్టుబాటు కల్పించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి వీలుగా కొత్త మార్కెటింగ్‌ పాలసీని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించింది. దళారీ వ్యవస్థకు పుల్‌స్టాప్‌ పెట్టి, మార్కెట్‌కు పంటలు తెచ్చే రైతు గిట్టుబాటు ధరకే ఆ పంటను విక్రయించేలా ఆధునిక పద్ధతులను అమలు చేయనున్నారు. మార్కెటింగ్‌ చట్టాల్లో సంస్కరణలు తేవడం ద్వారా ‘ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ మార్కెటింగ్‌ పాలసీ-2015’ను అన్వయం చేసుకుంటూ జీవోనెం.27ను తెచ్చారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌. ప్రేంచంద్రారెడ్డి ఉత్తర్వులిచ్చారు. అత్యాధునిక సాంకేతిక విధానంతో ఏ ప్రాంతంలో ఏ ధర ఉంది.. పంటకు గిట్టుబాట ధర లభించడానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Tags:    
Advertisement

Similar News