తెలంగాణలో మరోసారి ఉగ్రవాదుల జాడలు
తెలంగాణలో మరోసారి ఉగ్రవాదుల కలకలం మొదలైంది. నల్గొండ జిల్లాలో గతవారం ఉగ్రవాదుల కదలికలు గుర్తించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లాలో వారం క్రితం తుపాకీతో బెదిరించి పారిపోయిన ఇద్దరూ కూడా ఉగ్రవాదులుగా పోలీసులు నిర్ధారించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరు నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుల కోసం నాలుగు బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై నిఘాను ముమ్మరం చేశారు. వచ్చే పోయే వాహనాలలో నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. గత […]
Advertisement
తెలంగాణలో మరోసారి ఉగ్రవాదుల కలకలం మొదలైంది. నల్గొండ జిల్లాలో గతవారం ఉగ్రవాదుల కదలికలు గుర్తించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నల్గొండ జిల్లాలో వారం క్రితం తుపాకీతో బెదిరించి పారిపోయిన ఇద్దరూ కూడా ఉగ్రవాదులుగా పోలీసులు నిర్ధారించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరు నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. నిందితుల కోసం నాలుగు బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై నిఘాను ముమ్మరం చేశారు. వచ్చే పోయే వాహనాలలో నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. గత వారం పారిపోయిన ఇద్దరూ కూడా తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నారని నమ్ముతున్నారు. వీరిని పట్టుకుంటే మరికొంతమంది ఆచూకీ లభించవచ్చని భావిస్తున్న పోలీసులు నిఘాను పటిష్టం చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Advertisement