తెలంగాణలో టీడీపీకి మరో ఝలక్.!?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క ఎంపీ మల్లారెడ్డి, అతి త్వరలో టీఆర్ఎస్లో చేరే అవకాశముందంటూ ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్ళుగా మల్లారెడ్డితో టీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నా, వీటిపై ఇప్పటిదాకా టీడీపీ సీరియస్‌గా స్పందించిన దాఖలాల్లేవు. తాజాగా మల్లారెడ్డి ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తేశారు. బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే […]
Advertisement
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ఒకే ఒక్క ఎంపీ మల్లారెడ్డి, అతి త్వరలో టీఆర్ఎస్లో చేరే అవకాశముందంటూ ప్రచారం జరుగుతోంది. గత కొన్నాళ్ళుగా మల్లారెడ్డితో టీఆర్ఎస్ నేతలు టచ్‌లో ఉన్నారన్న ఊహాగానాలు విన్పిస్తున్నా, వీటిపై ఇప్పటిదాకా టీడీపీ సీరియస్‌గా స్పందించిన దాఖలాల్లేవు. తాజాగా మల్లారెడ్డి ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తేశారు. బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమన్నారాయన. తెలంగాణకు కేసీఆర్ రూపంలో మంచి ముఖ్యమంత్రి దొరికారనీ, కొత్త రాష్ట్రం అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నారనీ మల్లారెడ్డి కితాబిచ్చారు. మామూలుగా అయితే అధికారంలో ఉన్న పార్టీతో విపక్షంలో ఎవరున్నా గలాటా పడాల్సిందే. ఇది ప్రస్తుత రాజకీయ సూత్రం. పైగా టీడీపీకీ టీఆర్ఎస్కీ మధ్య ఘాటైన మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని టీఆర్ఎస్ కుట్రపూరితంగా ‘ఓటుకు నోటు’ కేసులో ఇరికించిందని టీడీపీ ఆరోపిస్తోన్న ఎపిసోడ్ ఓ పక్క ఘాటుగా నడుస్తోంటే, ఇంకోపక్క టీడీపీ ఎంపీ, టీఆర్ఎస్ పాలనను పొగడటం అంటే, తెరవెనుక ఏదో వ్యవహారం గట్టిగా నడుస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం అధినేత ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
Advertisement