గుడిసెలు లేని నగరంగా హైదరాబాద్: కేసీఆర్ ఆకాంక్ష
హైదరాబాద్‌లో గుడిసెలు లేని నగరంగా తీర్చి దిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. దీంతో తెలంగాణలో ఉచిత భూ క్రమబద్దీకరణ పథకం పట్టాలెక్కినట్టయ్యింది. 3,300 మంది కుటుంబాలకు కేసీఆర్ పట్టాల పంపిణీ చేశారు. రూ. 10 వేల కోట్ల రూపాయల విలువైన భూములను పేదలకు క్రమబద్దీకరించి పంపిణీ చేస్తున్నామని, ఇది తనకు గొప్ప అనుభూతిగా మిగులుతుందని, తెలంగాణ రాష్ట్రం సాధించి యేడాది పూర్తయిన సందర్భంగా ఈ కానుక ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. జంట నగరాల్లో లక్ష […]
Advertisement
హైదరాబాద్‌లో గుడిసెలు లేని నగరంగా తీర్చి దిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. దీంతో తెలంగాణలో ఉచిత భూ క్రమబద్దీకరణ పథకం పట్టాలెక్కినట్టయ్యింది. 3,300 మంది కుటుంబాలకు కేసీఆర్ పట్టాల పంపిణీ చేశారు. రూ. 10 వేల కోట్ల రూపాయల విలువైన భూములను పేదలకు క్రమబద్దీకరించి పంపిణీ చేస్తున్నామని, ఇది తనకు గొప్ప అనుభూతిగా మిగులుతుందని, తెలంగాణ రాష్ట్రం సాధించి యేడాది పూర్తయిన సందర్భంగా ఈ కానుక ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. జంట నగరాల్లో లక్ష మంది పేదవారికి పట్టాలు పంపిణీ చేస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. రాబోయే కాలంలో పేదలు గృహాలు లేకుండా ఉండే పరిస్థితి లేకుండా చేస్తామని, అందరికీ ఇళ్ళు నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా లబ్దిదారుల నుంచి తీసుకోబోమని సీఎం ప్రకటించారు. దీనికి బస్తీల్లో ఉండే యువకులు సహకరించాలని, ఎవరికీ గృహాలు అందలేదనే ఫిర్యాదులు లేకుండా అసలైన లబ్దిదారులకు అందేట్టుగా చూడాలని ఆయన కోరారు. హైకోర్టు పరిధిలో భూముల క్రమబద్దీకరణ అంశం ఉందని, ఇప్పుడు పట్టాలిచ్చినా తుది తీర్పునకు లోబడే చెల్లుబాటు అవుతుందని ఆయన ప్రకటించారు. జీ.వో. 55 కింద 3,36 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇందులో లక్ష 25 వేల మందికి ఇప్పుడు ఇస్తున్నామని, మరో రెండు లక్షల మందికి కూడా త్వరలో ఇస్తామని చెప్పారు. కొన్ని భూములు వివాదంలో ఉన్నందువల్ల వక్ఫ్‌బోర్డుతోను, దేవాదాయ అధికారులతోను మాట్లాడాల్సిన అవసరం ఉందని, అవసరమైతే డబ్బులు చెల్లించి భూములను తీసుకుని పేదలకు పంచుతామని ఆయన చెప్పారు. దళితులు, బడుగు బలహీనవర్గాలు, మైనారిటీలు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని ఆయన అన్నారు.
Advertisement