100 మామిడి చెట్ల‌కు 25 మంది పోలీసుల కాప‌లా!

బీహార్‌లో తాజా, మాజీ సీఎంలు నితీశ్‌, జితన్‌ రామ్‌ మాంఝీ మధ్య ఫ్రూట్ వార్ జ‌రుగుతోంది. పండ్లకోసం ఈ ఇద్దరు నేతలు పై చేయి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. పాట్నాలో 1-అన్నె మార్గ్‌లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంది. ఇక్కడ మామిడి, లిచీతో పాటు రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ఈ బంగ్లాలో ఉన్నవాళ్లే వీటిని తినే అవ‌కాశం ఉంటుంది. వేరేవాళ్లను పండ్లు ముట్టనివ్వరు. పదవినుంచి బహిష్కృతుడైన మాంఝీ ఇంకా సీఎం అధికారిక నివాసంలోనే ఉంటున్నారు. అయితే నితీష్ […]

Advertisement
Update:2015-06-04 18:34 IST
బీహార్‌లో తాజా, మాజీ సీఎంలు నితీశ్‌, జితన్‌ రామ్‌ మాంఝీ మధ్య ఫ్రూట్ వార్ జ‌రుగుతోంది. పండ్లకోసం ఈ ఇద్దరు నేతలు పై చేయి కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. పాట్నాలో 1-అన్నె మార్గ్‌లో ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉంది. ఇక్కడ మామిడి, లిచీతో పాటు రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ఈ బంగ్లాలో ఉన్నవాళ్లే వీటిని తినే అవ‌కాశం ఉంటుంది. వేరేవాళ్లను పండ్లు ముట్టనివ్వరు. పదవినుంచి బహిష్కృతుడైన మాంఝీ ఇంకా సీఎం అధికారిక నివాసంలోనే ఉంటున్నారు. అయితే నితీష్ మాత్రం వేరే చొట ఉంటున్నారు. మొత్తం ఈ తోట‌లో వంద చెట్లు ఉన్నాయి. వీటికి కాస్తున్న ప‌ళ్ళ‌ను మాంఝీ తిన‌కుండా చేయ‌డం కోసం ఓ పాతిక మంది పోలీసుల‌ను ప‌హారాగా పెట్టారు. వంద చెట్ల‌కు పాతిక మంది పోలీసుల కాప‌లా అన్న‌మాట! 1-అన్నెమార్గ్‌ ప్రాంతంలోని చెట్ల పండ్లను ఎవరూ కోయవద్దని ఆదేశిస్తూ 8 మంది ఎస్సైలు, 16 మంది పోలీసులతో ఈ చెట్లకు రక్షణ ఏర్పాటు చేశారు. ఈ మధ్య సీఎం భవనం తోటమాలి.. మాంఝీ కోసం ఓ మామిడి పండు తెంపడంతో.. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో చిర్రెత్తిన మాంఝీ.. నితీష్‌ సర్కార్‌ మామిడి పళ్లను కూడా తిననివ్వటం లేదని.. చెట్లకు పోలీసులను రక్షణగా పెట్టి తనపై కక్ష సాధిస్తున్నారని మీడియాకెక్కారు. అయితే పేపర్లో చూసేంత వరకు ఇలా జరుగుతున్నట్లు తనకు తెలియదని.. నితీశ్‌ తెలిపారు. మొత్ం మీద బీహార్ ఫ్రూట్ వార్ ర‌స‌కందాయంలో ఉంద‌న్న మాట!
Tags:    
Advertisement

Similar News