ఏసీబీ కస్టడీకి రేవంత్‌ రెడ్డి

ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రేవంత్‌రెడ్డిని 4రోజుల కస్టడీకి అనుమతించింది. ఎ1 గా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు ఎ2, ఎ3లుగా ఉన్న సెబాస్టియన్‌, ఉదయసింహలను కూడా ఏసీబీ కస్టడీకీ కోర్టు అనుమతించింది. ఎ4 గా ఉన్న మట్టయ్య పరారిలో ఉన్నారు. అయితే విచారణ జూన్‌ 6 నుండి 9 వరకు ఉదయం […]

Advertisement
Update:2015-06-05 11:48 IST

ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రేవంత్‌రెడ్డిని 4రోజుల కస్టడీకి అనుమతించింది. ఎ1 గా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు ఎ2, ఎ3లుగా ఉన్న సెబాస్టియన్‌, ఉదయసింహలను కూడా ఏసీబీ కస్టడీకీ కోర్టు అనుమతించింది. ఎ4 గా ఉన్న మట్టయ్య పరారిలో ఉన్నారు. అయితే విచారణ జూన్‌ 6 నుండి 9 వరకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరపాలని, అడ్వకేట్‌ సమక్షంలోనే జరపాలని కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విచారణను కోర్టు ఆదేశించింది. అంతకు ముందు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రోజు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News