కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధిష్ఠానం పెద్దలు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఫోన్‌లో తెలిపారు. రెండు రోజుల్లో తన అనుచరులతో బొత్స వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. బొత్స సస్పెన్షన్‌పై రఘువీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే బొత్స సత్యనారాయణను సస్పెండ్ చేశామని చెప్పారు. బొత్స కాంగ్రెస్‌కు ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. బొత్స తప్పు చేస్తున్నారని, ఒకరిద్దరు పార్టీని వీడినా కాంగ్రెస్‌కు […]
Advertisement
కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అధిష్ఠానం పెద్దలు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికి ఫోన్‌లో తెలిపారు. రెండు రోజుల్లో తన అనుచరులతో బొత్స వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. బొత్స సస్పెన్షన్‌పై రఘువీరారెడ్డి మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే బొత్స సత్యనారాయణను సస్పెండ్ చేశామని చెప్పారు. బొత్స కాంగ్రెస్‌కు ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. బొత్స తప్పు చేస్తున్నారని, ఒకరిద్దరు పార్టీని వీడినా కాంగ్రెస్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదని రఘువీరారెడ్డి హెచ్చరించారు.
విజయనగరంలో కాంగ్రెస్ ఖాళీ!
విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. డీసీసీ నేతలు పార్టీకి, పదవులకు రాజీనామా చేయడంతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని రద్దుచేశారు. దానికున్న బోర్డును కూడా తొలగించేశారు. మొత్తం డీసీసీ కార్గవర్గంతోపాటు అన్ని మండల శాఖల కార్యవర్గాలు కూడా రాజీనామా చేసి లేఖలను పీసీసీకి ఫాక్స్‌లో పంపామని డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పిళ్లా విజయ్‌కుమార్ తెలిపారు. తామంతా ఈ నెల 7న బొత్సతోపాటు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నామని చెప్పారు. బొత్స ఎటు వెళ్తే తామూ అటేనని ఇదివరకే ప్రకటించామని పిళ్లా తెలిపారు. కాగా ఈ నెల 7న బొత్సతోపాటు సుమారు 200 మంది నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ తర్వాత విజయనగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సభతో విజయనగరం జిల్లాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఊపు తీసుకురావాలని బొత్స భావిస్తున్నారని తెలుస్తుంది.
Advertisement