బాబు హామీలన్నీ బూటకమని ఆనాడే చెప్పా
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలన్నీ బూటకమని తాను ఆనాడే చెప్పానని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు వై. జగన్మోహనరెడ్డి గుర్తు చేశారు. ఆయన మంగళగిరిలో రెండు రోజులపాటు చేపట్టిన సమరదీక్షను విరమిస్తూ గురువారం ఆయన బహిరంగసభలో ప్రసంగించారు. హామీలు అమలు చేయడం చేతకాని చంద్రబాబు తాను ఇచ్చిన హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చినవని ఇపుడు మాట మారుస్తున్నారని జగన్ ఆరోపించారు. ఏపీ సిఎం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు బాబు […]
Advertisement
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలన్నీ బూటకమని తాను ఆనాడే చెప్పానని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు వై. జగన్మోహనరెడ్డి గుర్తు చేశారు. ఆయన మంగళగిరిలో రెండు రోజులపాటు చేపట్టిన సమరదీక్షను విరమిస్తూ గురువారం ఆయన బహిరంగసభలో ప్రసంగించారు. హామీలు అమలు చేయడం చేతకాని చంద్రబాబు తాను ఇచ్చిన హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఇచ్చినవని ఇపుడు మాట మారుస్తున్నారని జగన్ ఆరోపించారు. ఏపీ సిఎం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు బాబు చెప్పిందేమిటి… ఇపుడు చేస్తున్నదేమిటి? అంటూ ప్రశ్నించారు. ఒక అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్దమాడుతున్నారని జగన్ విమర్శించారు. సమరదీక్ష ముగింపుకు ముందు ఆయన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సీడీలను ప్రదర్శించారు. కనీసం తాను ఏపీకి ప్రత్యేక హోదా కూడా తేలేకపోయారని, మిత్రపక్షం అయిన బీజేపీ ప్రభుత్వంతో కూడా పని చేయించుకోవడం చేతకాని దద్దమ్మ అని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా తేలేనప్పుడు కేంద్రంలో ఇద్దరు మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక్కో ఎమ్మెల్యేని రూ. 5 కోట్లకు సంతలో కొన్నట్టు కొనే ప్రయత్నం చేశారని, ఈ ఎపిసోడ్‌లో రేవంత్ చంద్రబాబుతో మాట్లాడించారని జగన్ ఆరోపించారు. నువ్వు వ్యవహరిస్తున్న తీరుకు జనం కొట్టే పరిస్థితి వస్తుందని, సెక్యూరిటీ వీడి గ్రామాల్లో తిరిగే ధైర్యం నీకుందా అని చంద్రబాబును ప్రశ్నించారు. రైతు వ్యతిరేకి అయిన చంద్రబాబు అన్నదాతలను కన్నీళ్ళు పెట్టిస్తున్నారని, మూడు పంటలు పండే భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో నీ ఆస్తులను లాక్కుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో అని జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేది తమ పార్టీయేనని ఆయన ధీమాగా చెప్పారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు.
Advertisement