ఈ యేడాది వర్షాలు 102శాతం: స్కైమెట్
భాతర వాతావరణ శాఖ లెక్కలకు, ఓ ప్రయివేటు సంస్థ లెక్కలకు వర్షం కురిసే విషయంలో తేడా వచ్చింది. వర్షం అనేది జోతిష్యం కాకపోయినా ఎవరి లెక్కలు నిజమో రెండు మూడు నెలల్లో పక్కాగా తెలిసిపోతుంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది సగటు వర్షపాతం 88 శాతం కాగా.. స్కైమెట్ లెక్క ప్రకారం ఈ ఏడాది 102 శాతం వర్షపాతం ఉండబోతోంది. జూన్ ఇప్పుడే మొదలైందని, వర్షాకాలంలో ఇంకా చాలా రోజులు ఉన్నాయని, జరగాల్సింది […]
Advertisement
భాతర వాతావరణ శాఖ లెక్కలకు, ఓ ప్రయివేటు సంస్థ లెక్కలకు వర్షం కురిసే విషయంలో తేడా వచ్చింది. వర్షం అనేది జోతిష్యం కాకపోయినా ఎవరి లెక్కలు నిజమో రెండు మూడు నెలల్లో పక్కాగా తెలిసిపోతుంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది సగటు వర్షపాతం 88 శాతం కాగా.. స్కైమెట్ లెక్క ప్రకారం ఈ ఏడాది 102 శాతం వర్షపాతం ఉండబోతోంది. జూన్ ఇప్పుడే మొదలైందని, వర్షాకాలంలో ఇంకా చాలా రోజులు ఉన్నాయని, జరగాల్సింది చాలా ఉందని, అంచనాలకు కళ్లాలు వేయాల్సిన అవసరం ఉందని స్కైమెట్ వ్యవస్థాపక కార్యనిర్వాహణ అధికారి జతిన్ సింగ్ అన్నారు. ఒకవేళ ఎల్‌నినో గనక కిందటి ఏడాది నుంచి కొనసాగుతుంటే.. దాని ప్రభావం తదుపరి సంవత్సరంలో ఉండదని, 1880 నుంచి ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని ఆయన అన్నారు. జూన్ ద్వితీయార్థంలోనూ, జూలై నెలలోనూ మంచి వానలు కురిసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 102 శాతం కాకపోయినా.. అత్యంత ఘోరమైన పరిస్థితుల్లోనూ ఈ ఏడాది కచ్చితంగా 98 శాతం వానలు కురుస్తాయని స్కైమెట్ ప్రధాన వాతావరణ నిపుణుడు మహేశ్ పలావత్ చెప్పారు. ఈ ఏడాది అరేబియా సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నాయని, దీనివల్ల ఐవోడీ సానుకూలంగా ఉండి ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించి వానలు బాగా కురుస్తాయన్నారు.
Advertisement