గోవాలో ఢిల్లీ యువ‌తుల గ్యాంగ్ రేప్‌

ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఇద్దరు యువతులను పోలీసులమంటూ బెదిరించి కిడ్నాప్ చేసి అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డిన ఘటన కలకలం రేపింది. డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్ గోయంకర్ క‌థ‌నం ప్రకారం   న్యూఢిల్లీకి చెందిన 20-30 ఏళ్ల  ఇద్దరు యువతులు గోవాలోని అంజునా బీచ్ కు వెళ్లడానికి ఒక ప్రైవేట్ క్యాబ్ లో బయల్దేరారు. అయితే మార్గమధ్యలో మోటార్ సైకిళ్ళ మీద వచ్చిన అయిదుగురు యువకులు వీరిని అడ్డగించారు. మత్తు మందుల […]

Advertisement
Update:2015-06-04 06:40 IST
ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఇద్దరు యువతులను పోలీసులమంటూ బెదిరించి కిడ్నాప్ చేసి అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డిన ఘటన కలకలం రేపింది. డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్ గోయంకర్ క‌థ‌నం ప్రకారం న్యూఢిల్లీకి చెందిన 20-30 ఏళ్ల ఇద్దరు యువతులు గోవాలోని అంజునా బీచ్ కు వెళ్లడానికి ఒక ప్రైవేట్ క్యాబ్ లో బయల్దేరారు. అయితే మార్గమధ్యలో మోటార్ సైకిళ్ళ మీద వచ్చిన అయిదుగురు యువకులు వీరిని అడ్డగించారు. మత్తు మందుల రవాణాను అడ్డుకునే పోలీసులమని, తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పి నమ్మించి యువతులపై దాడికి దిగారు. యువతులతో పాటు, టాక్సీ డ్రైవర్ ను దారుణంగా కొట్టి, వారి బ్యాగులను లాక్కున్నారు. ఆ తర్వాత యువతులను కిడ్నాప్ చేసి స్థానికంగా ఉన్న ఒక రిసార్ట్ కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సుమారు రెండు రోజులపాటు యువతులను చిత్రహింసలు పెట్టి వారిపై లైంగిక దాడి చేశారు. కాగా టాక్సీ డ్రైవర్ ఫిర్యాదుతో అప్రమత్తం అయిన పోలీసులు.. బాధిత యువతులతో పాటు ఐదుగురి యువకులనూ అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులపై కేసు నమోదు చేశామని, రిసార్ట్ యజమాని పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని గోయంకర్ తెలిపారు. నిందితులు ముంబై, కర్ణాటక, హైదారాబాద్, రాజస్థాన్ కు చెందినవారుగా గుర్తించారు.
Tags:    
Advertisement

Similar News