తెలంగాణలో అంగన్‌వాడీల వేతనాల పెంపు
అంగన్‌వాడీ కార్మికుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అంగన్ వాడీ వర్కర్ వేతనం రూ.4200 నుంచి రూ.7000కు, హెల్పర్, మినీ అంగన్ వాడీ వర్కర్ వేతనం రూ.2200 నుంచి రూ.4500 కు పెంచుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు విడుదల చేశారు. పెంచిన జీతాలను 2015 మార్చి 1 నుండి అమలు చేయనున్నారు. అంగన్ వాడీ వర్కర్ల జీతాలను పెంచాలని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఎన్నో ఏళ్ళుగా […]
Advertisement
అంగన్‌వాడీ కార్మికుల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అంగన్ వాడీ వర్కర్ వేతనం రూ.4200 నుంచి రూ.7000కు, హెల్పర్, మినీ అంగన్ వాడీ వర్కర్ వేతనం రూ.2200 నుంచి రూ.4500 కు పెంచుతూ మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు విడుదల చేశారు. పెంచిన జీతాలను 2015 మార్చి 1 నుండి అమలు చేయనున్నారు. అంగన్ వాడీ వర్కర్ల జీతాలను పెంచాలని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఎన్నో ఏళ్ళుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ వర్కర్లను హైదరాబాద్‌కు పిలిపించుకొని సచివాలయంలో ఒక రోజంతా వారి సమస్యలపై సీఎం అధికారులతో చర్చించారు. ఆ సమావేశంలోనే అంగన్ వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని సంబంధిత అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Advertisement