పెళ్ళాపిన వాట్సాప్!
బాల్య వివాహన్ని పోలీసుల సాయంతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో చోటు చేసుకుది. మెదక్ జిల్లాకు చెందిన 15 సంవత్సరాల బాలికకు సరూర్‌నగర్‌లోని ఏఎస్‌ఆర్ గార్డెన్స్‌లో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి ఇష్టం లేని బాలిక ఈ విషయాన్ని వాట్పప్ ద్వారా రాత్రి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్ సభ్యుడు అచ్యుతరావు ఎల్‌బీనగర్ ఏసీపీకి ముందస్తు సమాచారమందించారు. వివాహం […]
Advertisement
బాల్య వివాహన్ని పోలీసుల సాయంతో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో చోటు చేసుకుది. మెదక్ జిల్లాకు చెందిన 15 సంవత్సరాల బాలికకు సరూర్‌నగర్‌లోని ఏఎస్‌ఆర్ గార్డెన్స్‌లో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి ఇష్టం లేని బాలిక ఈ విషయాన్ని వాట్పప్ ద్వారా రాత్రి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన కమిషన్ సభ్యుడు అచ్యుతరావు ఎల్‌బీనగర్ ఏసీపీకి ముందస్తు సమాచారమందించారు. వివాహం జరిగే సమయానికి పోలీసులు, కమిషన్ సభ్యులు ఫంక్షన్ హాల్‌కి వచ్చి అడ్డుకున్నారు. అనంతరం తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేయకూడదని, దాని వల్ల ఎన్నో అనర్ధాలు వస్తాయని ఆయన వధువు తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. అయితే అక్కడ నుంచి పెళ్ళి ఆపి వెళ్ళిపోయారు.
Advertisement