బొగ్గు కుంభకోణం కేసులో జడ్జి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుల తరపు న్యాయవాది ఒకరు తనను సంప్రదించాడని, కేసు విచారణను ప్రభావితం చేసేందుకు యత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ న్యాయవాది పేరును జడ్జి వెల్లడించలేదు. ఈ కేసులో నిందితుల తరపున వకాలత్ దాఖలు చేసిన న్యాయవాదులు మాత్రమే కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇంకెవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదని […]
Advertisement
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుల తరపు న్యాయవాది ఒకరు తనను సంప్రదించాడని, కేసు విచారణను ప్రభావితం చేసేందుకు యత్నించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ న్యాయవాది పేరును జడ్జి వెల్లడించలేదు. ఈ కేసులో నిందితుల తరపున వకాలత్ దాఖలు చేసిన న్యాయవాదులు మాత్రమే కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇంకెవరైనా జోక్యం చేసుకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
Advertisement