రేవంత్ పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా?
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇదే. నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపిన కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ ను అరెస్టు చేసి ఆదివారం అర్థరాత్రి ఉస్మానియాలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు పక్కాగా ఉండటంతో దాదాపు 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిజంగా అంత భారీ శిక్ష […]
Advertisement
ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఇదే. నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు రూ.50 లక్షలు లంచం ఇవ్వజూపిన కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రేవంత్ ను అరెస్టు చేసి ఆదివారం అర్థరాత్రి ఉస్మానియాలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు పక్కాగా ఉండటంతో దాదాపు 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిజంగా అంత భారీ శిక్ష పడితే ఇక రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ముగిసినట్లే!. ఎందుకంటే రెండేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన నేతలెవరైనా ఎన్నికల్లో పోటీకి అనర్హులని నిబంధనలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ వ్యవహారంలో రేవంత్ తన లైఫ్ రిస్క్ చేశాడని అంతా అంటున్నారు.
Advertisement