అత్యాచారం... ఐఎస్ వికృత క్రీడ!
ఇస్లామిక్ చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయన్నది నిజం. శిక్షలు కూడా దారుణంగా ఉంటాయన్నది అనేకసార్లు రుజువైన సత్యం. అయితే అక్కడ కూడా అరాచకం అదేస్థాయిలో ఉంటుందని… హింసోన్మాదం దీన్ని మరపిస్తుందని ఎంతమందికి తెలుసు… తీవ్రవాదం ముసుగులో మహిళలను కిడ్నాప్ చేసి హింసించడం, సామూహిక అత్యాచారం చేయడం, బలవంతంగా వారి ద్వారా పిల్లలను కనడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. 9 నెలలు ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉండి, వారి నుంచి తప్పించుకున్న ఓ బాధితురాలు తన వ్యథను తెలియజేసింది. […]
Advertisement
ఇస్లామిక్ చట్టాలు ఎంతో కఠినంగా ఉంటాయన్నది నిజం. శిక్షలు కూడా దారుణంగా ఉంటాయన్నది అనేకసార్లు రుజువైన సత్యం. అయితే అక్కడ కూడా అరాచకం అదేస్థాయిలో ఉంటుందని… హింసోన్మాదం దీన్ని మరపిస్తుందని ఎంతమందికి తెలుసు… తీవ్రవాదం ముసుగులో మహిళలను కిడ్నాప్ చేసి హింసించడం, సామూహిక అత్యాచారం చేయడం, బలవంతంగా వారి ద్వారా పిల్లలను కనడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. 9 నెలలు ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉండి, వారి నుంచి తప్పించుకున్న ఓ బాధితురాలు తన వ్యథను తెలియజేసింది. ఐఎస్ ఉగ్రవాదులు జిహాదీ పేరుతో చేస్తున్న హింసను ఇరాక్ లోని సింజన్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల యజీదీ తెగ అమ్మాయి స్వయంగా అనుభవించింది. ‘గతేడాది ఆగస్టులో నన్ను, నా సోదరిని ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మమ్మల్ని సిరియాలో ఐఎస్ ఆధీనంలో ఉన్న రక్కాకు తరలించారు. మా ఇద్దరితో పాటు పదుల సంఖ్యలో యువతులకు కన్యత్వ పరీక్షలు చేయించారు. మమ్మల్నందరినీ ఓ గదిలోకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్టారు. ఉగ్రవాదులు తమకు నచ్చిన అమ్మాయిలను ఎంచుకున్నారు. నన్ను, నా చెల్లిని, మరో ఇద్దరు అమ్మాయిలను అమ్మేశారు. చెచెన్యాకు చెందిన అల్-రషియా అనే ఐఎస్ ఉగ్రవాది మమ్మల్ని కొనుగోలు చేశాడు. మమ్మల్ని రోజూ ఉదయం నగ్నంగా నిలబెట్టేవారు. యజమాని తనకు నచ్చినవారిని అత్యాచారం చేసేవాడు. ఆయనతో పాటు అనుచరులు మమ్మల్ని రోజూ దారుణంగా హింసించి సామూహిక అత్యాచారం చేసేవారు. వారి శారీకవాంఛలు తీర్చకపోతే వేడి నీళ్లను కాళ్లపై పోసి చిత్రహింసలు పెట్టేవారు. ఆ తొమ్మిది నెలలూ చస్తూ బతికాను. నన్ను గర్భవతిని చేశారు. గత నెలలో అల్ -రషియాను, అతని బాడీగార్డులను ఖుర్దిష్ సైనికులు కాల్చివేశారు. దీంతో మాకు స్వేచ్ఛ లభించింది.
Advertisement