40లక్షల ఖర్చుతో సీఎం క్యాంప్ ఆఫీస్ కు హెచ్.టి.లైన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బెజవాడ క్యాంపు కార్యాలయం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఈ కార్యాలయాన్ని అన్ని మెరుగులతో తీర్చిదిద్దారు. తాజాగా విద్యుత్ కనెక్షన్లు, ఇతర పనులను పూర్తిచేశారు. ముఖ్యమంత్రికి జెడ్ ఫ్లస్ కేటగిరి భద్రత ఉండే నేపథ్యంలో క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా రెండు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి 24 గంటలూ సరఫరా ఉండేలా పక్కా ప్రణాళికతో పనులు పూర్తిచేశారు. రూ.23 లక్షలతో రెండు సబ్ స్టేషన్ల నుంచి అండర్ […]

Advertisement
Update:2015-05-30 00:02 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బెజవాడ క్యాంపు కార్యాలయం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఈ కార్యాలయాన్ని అన్ని మెరుగులతో తీర్చిదిద్దారు. తాజాగా విద్యుత్ కనెక్షన్లు, ఇతర పనులను పూర్తిచేశారు. ముఖ్యమంత్రికి జెడ్ ఫ్లస్ కేటగిరి భద్రత ఉండే నేపథ్యంలో క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా రెండు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి 24 గంటలూ సరఫరా ఉండేలా పక్కా ప్రణాళికతో పనులు పూర్తిచేశారు. రూ.23 లక్షలతో రెండు సబ్ స్టేషన్ల నుంచి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సమీపంలో ఇరిగేషన్ రాష్ట్రస్థాయి అధికారుల కార్యాలయాలకు కూడా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. రెండు కార్యాలయాలకు కలిపి సుమారు రూ.40 లక్షల బడ్జెట్ అంచనాలు రూపొందించగా ఇప్పటికే రూ.31 లక్షలు ఖర్చు చేశారు.
సీఎం క్యాంపు కార్యాలయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి వీలుగా విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మొగల్రాజపురం సబ్ స్టేషన్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయంలోని ట్రాన్స్ ఫార్మర్ వరకు సుమారు 900 మీటర్ల పొడవున అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ లైన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 200 కేవీ హెచ్.టి.(హైటెన్షన్) లైన్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా ఇస్తారు. ఓవర్ లోడ్, ఇతర సమస్యలు ఉత్పన్నం కాకుండా మ్యూజియం రోడ్ లోని సబ్ స్టేషన్ నుంచి మరో అండర్ గ్రౌండ్ లైన్ ఏర్పాటు చేసి దానిని కూడా సీఎం క్యాంపు కార్యాలయంలోని ట్రాన్స్ ఫార్మర్ కు కనెక్ట్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయంలో ఒక ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. కార్యాలయంలో 11కేవీ హెచ్.టి.లైన్ ఏర్పాటు చేయటంతో ప్రత్యేకంగా అన్ని భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి మొత్తం రూ.23.39 లక్షల ఖర్చయింది.

Tags:    
Advertisement

Similar News