సాగర్‌పై నిపుణుల కమిటీ ఖర్చులు టి-సర్కారువే

హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం సుప్రీంకోర్టు సూచన మేరకు చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) నిపుణుల కమిటీని నియమించింది. ఎన్‌ఐటీటీటీఆర్‌ డైరెక్టర్‌ ఎస్‌. మోహన్‌, కర్ణాటక హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్‌ దేవరాజ్‌ అశోక్‌లను కమిటీ సభ్యులుగా నియమిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సభ్యులకు రూ.50వేల రెమ్యూనరేషన్‌ నిర్ణయిస్తూ.. ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ చెల్లించాలని పేర్కొంది. నిపుణుల బృందం హుస్సేన్‌సాగర్‌ను సందర్శించే సమయంలో వారికి రవాణా, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించింది. సాగర్‌ నీటి […]

Advertisement
Update:2015-05-29 18:45 IST
హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం సుప్రీంకోర్టు సూచన మేరకు చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) నిపుణుల కమిటీని నియమించింది. ఎన్‌ఐటీటీటీఆర్‌ డైరెక్టర్‌ ఎస్‌. మోహన్‌, కర్ణాటక హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్‌ దేవరాజ్‌ అశోక్‌లను కమిటీ సభ్యులుగా నియమిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సభ్యులకు రూ.50వేల రెమ్యూనరేషన్‌ నిర్ణయిస్తూ.. ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ చెల్లించాలని పేర్కొంది. నిపుణుల బృందం హుస్సేన్‌సాగర్‌ను సందర్శించే సమయంలో వారికి రవాణా, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించింది. సాగర్‌ నీటి ఖాళీపై సేవ్‌ అవర్‌ అర్బన్‌ లేక్స్‌ (సోల్‌) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేయాలని అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 26వ తేదీన ఎన్‌జీటీకి సూచించింది. స్పందించిన ఎన్‌జీటీ ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ.. వారు ఏం చేయాలనేది దిశానిర్దేశం చేసింది.
Tags:    
Advertisement

Similar News