వడదెబ్బ మృతులకు రాష్ట్ర విపత్తు నిధి
తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై మరణిస్తున్న వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్)ని వాడుకోవచ్చునని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఎన్డీయే ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వడదెబ్బ, పిడుగుపాటు.. ఇలా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ విపత్తులుగా పరిగణించే వాటికి కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి సహాయం అందించేలా నిబంధనల్ని సడలిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. […]
Advertisement
తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురై మరణిస్తున్న వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్)ని వాడుకోవచ్చునని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఎన్డీయే ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలోని జాతీయ మీడియా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వడదెబ్బ, పిడుగుపాటు.. ఇలా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ విపత్తులుగా పరిగణించే వాటికి కూడా ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి సహాయం అందించేలా నిబంధనల్ని సడలిస్తూ విధాన నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇలాంటి ప్రాంతీయ విపత్తులకు పరిహారంగా ఎస్‌డీఆర్‌ఎఫ్‌లోని 10 శాతం నిధుల్ని రాష్ట్రాలు వాడుకోవచ్చునని వివరించారు. వివిధ విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఎస్‌డీఆర్‌ఎఫ్ ద్వారా ఇచ్చే పరిహారాన్ని రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచామని చెప్పా రు. ఇంత వరకూ కనీసం 50శాతం పంట నష్టం జరిగితేనే రైతులకు పరిహారం లభించేదని, ఇకపై 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ నష్టం జరిగినప్పుడు కూడా పరిహారం అందిస్తామని తెలిపారు. కేంద్రం నోటిఫై చేసిన 12 విపత్తులతో పాటు పిడుగుపాటు, వడదెబ్బ వంటి ప్రాంతీయ విపత్తుల కారణంగా నష్టపోయిన పంటలకు కూడా ఈ పరిహారాన్ని ఇస్తామన్నారు.
Advertisement