ఏపీకి వెళ్లినా 58 ఏళ్లకే రిటైర్మెంట్-టీ ఉద్యోగులకు షాక్
ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లే చర్యలు చేపట్టబోతోంది. అటువంటి ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 58 ఏళ్లు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను సవరించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. వాస్తవానికి తెలంగాణలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ 58 ఏళ్లుగా ఉంది. మరోపక్క ఏపీలో మాత్రం అక్కడి ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకి పెంచింది. దీంతో ఏపీకి వస్తే రెండేళ్ల సర్వీసు […]
Advertisement
ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై ఏపీ ప్రభుత్వం నీళ్లు చల్లే చర్యలు చేపట్టబోతోంది. అటువంటి ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 58 ఏళ్లు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను సవరించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. వాస్తవానికి తెలంగాణలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ 58 ఏళ్లుగా ఉంది. మరోపక్క ఏపీలో మాత్రం అక్కడి ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకి పెంచింది. దీంతో ఏపీకి వస్తే రెండేళ్ల సర్వీసు పెరుగుతుందనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యోగులు కొందరు అక్కడి ఆప్షన్స్ ఇస్తున్నారని ఏపీ ఎన్జీవో సంఘం ప్రతినిధులు ఆరోపించారు. ఈ విషయమై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయిస్తే తమకు వచ్చే పదోన్నతులు, సీనియారిటీకి నష్టం వాటిల్లుతుందని వివరించారు. కాబట్టి ఏపీకి ఆప్షన్ ఇచ్చిన తెలంగాణ ఉద్యోగులకు పదవీ విరమణ పెంపు 60 ఏళ్లుగా కాకుండా 58 ఏళ్లనే వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ ఏపీకి ఆప్షన్ ఇచ్చిన తెలంగాణ ఉద్యోగుల సంఖ్య ఎంత ఉందనేది లెక్కలు చెప్పాలని ఆదేశించింది. మొత్తం 700 మంది వరకూ ఉన్నారని ఉన్నతాధికారులు లెక్క తేల్చారు. ఈ వివరాలన్నీ తీసుకున్న ప్రభుత్వం.. ఉద్యోగుల పదవీ విరమణ చట్టాన్ని సవరించి తెలంగాణ ఉద్యోగులను 58 ఏళ్లకే రిటైర్ చేయవచ్చా లేదా అనే దానిపై న్యాయ శాఖ సలహా కోరింది. చట్టాన్ని సవరించుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పడంతో ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
Advertisement