చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఉల్లి కాడలు
అనేక రకాల కూరల్లో వాడే ఉల్లి కాడలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యమైన ఔషధం. కెలొరీలు కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు. ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఉల్లి కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది. వీటిలోని […]
Advertisement
అనేక రకాల కూరల్లో వాడే ఉల్లి కాడలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. కాలేయం చుట్టూ పేరుకుని ఉండే అధిక కొవ్వు తగ్గేలా చూస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యమైన ఔషధం. కెలొరీలు కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు. ఇవి ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఉల్లి కాడల్లోని గ్జియాంతిన్ అనే పదార్ధం కంటి చూపును మెరుగు పరుస్తుంది. వీటిలోని కెమోఫెరాల్ అనే ఫ్లవనాయిడ్ రక్తనాళాలపై ఒత్తిడి లేకుండా, రక్తం సాఫీగా సరఫరా అయ్యేట్లు చేస్తుంది. ఉల్లికాడలను ఎక్కువగా వాడేవారిలో రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. వీటిలోని ఫొలేట్లు గుండె జబ్బులను అదుపులో ఉంచుతాయి.
Advertisement