విజయవాడ యువతిపై 15 మంది అత్యాచారం
ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించి విజయవాడకు చెందిన ఓ యువతిని సిద్ధిపేటకు తీసుకువచ్చి…ఆమెపై 15 మంది సామూహిక అత్యాచారం జరిపిన ఉదంతం మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. తాను మంచి ఉద్యోగం ఇప్పిస్తామని, తనకు తెలిసిన అనేక మందికి ఎన్నో ఉద్యోగాలు ఇప్పించానని చెప్పి ఓ మహిళ ఈ యువతిని విజయవాడ నుంచి తీసుకువచ్చి మెదక్ జిల్లా సిద్ధిపేటలోని హరిహరా రెసిడెన్సీలో ఉంచింది. అక్కడ నుంచి ఆమె బయటకు వెళ్ళగా యువతి హోటల్ గదిలోనే ఉంది. ఈ […]
;Advertisement
ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించి విజయవాడకు చెందిన ఓ యువతిని సిద్ధిపేటకు తీసుకువచ్చి…ఆమెపై 15 మంది సామూహిక అత్యాచారం జరిపిన ఉదంతం మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. తాను మంచి ఉద్యోగం ఇప్పిస్తామని, తనకు తెలిసిన అనేక మందికి ఎన్నో ఉద్యోగాలు ఇప్పించానని చెప్పి ఓ మహిళ ఈ యువతిని విజయవాడ నుంచి తీసుకువచ్చి మెదక్ జిల్లా సిద్ధిపేటలోని హరిహరా రెసిడెన్సీలో ఉంచింది. అక్కడ నుంచి ఆమె బయటకు వెళ్ళగా యువతి హోటల్ గదిలోనే ఉంది. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఓ 15 మంది యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. ఉద్యోగం ఆశ చూపి ఈ యువతిని సిద్ధిపేటకు తీసుకువచ్చిన మహిళ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు.
Advertisement