వైఎస్ జగన్‌కు కేటీఆర్ ఫోన్!
ఇద్దరివి రాజకీయంగా భిన్న ధృవాలు… నాలుగేళ్ల క్రితం ఆయన పేరు చెబితేనే భగ్గుమనేవారు.. తెలంగాణ గడ్డ మీద అడుగు పెడితే ఖబడ్డార్ ! అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వస్తే ఏం చేస్తావంటూ? అవతలి వ్యక్తి రానే వచ్చారు. ఇంకేముంది అతడు అడుగిడిన చోటు రణరంగమైంది. చివరికి కాల్పులకు దారి తీసింది. దీంతో ఇరుపక్షాల మధ్య విభేదాలు శత్రుత్వంగా రూపుదాల్చాయి. పరస్పర ఆరోపణలు దూషణలతో ప్రతిరోజూ పత్రికల్లో పతాకశీర్షికన నిలిచేవారు. ఇంతకీ వారెవరా? కేటీఆర్- జగన్. వైఎస్సార్‌సీపీ […]
Advertisement
ఇద్దరివి రాజకీయంగా భిన్న ధృవాలు… నాలుగేళ్ల క్రితం ఆయన పేరు చెబితేనే భగ్గుమనేవారు.. తెలంగాణ గడ్డ మీద అడుగు పెడితే ఖబడ్డార్ ! అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వస్తే ఏం చేస్తావంటూ? అవతలి వ్యక్తి రానే వచ్చారు. ఇంకేముంది అతడు అడుగిడిన చోటు రణరంగమైంది. చివరికి కాల్పులకు దారి తీసింది. దీంతో ఇరుపక్షాల మధ్య విభేదాలు శత్రుత్వంగా రూపుదాల్చాయి. పరస్పర ఆరోపణలు దూషణలతో ప్రతిరోజూ పత్రికల్లో పతాకశీర్షికన నిలిచేవారు. ఇంతకీ వారెవరా? కేటీఆర్- జగన్.
వైఎస్సార్‌సీపీ మద్దతిస్తుందా?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేందుకు ఇదే తాజా ఉదాహరణ.. ఒకప్పుడు ఒకరిపై ఒకరు మాటలతోనే కత్తులు దూసుకున్న కేటీఆర్- జగన్‌లు ఇప్పుడు మాట్లాడుకున్నారు. ఎందుకంటే.. తెలంగాణ మండలి ఎన్నికలు జూన్ 1న జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ 5వ అభ్యర్థికి మద్దతు కోసం వైఎస్సార్‌సీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ విషయమై కేటీఆర్ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డికి ఫోన్ చేశారు. మద్దతు కావాలని అడిగారు. దీనికి జగన్ ఆలోచించుకుని చెబుతాం అన్నట్లుగా సమాచారం. అయితే కొంతకాలంగా టీఆర్ ఎస్ – వైఎస్సార్‌సీపీ మిత్రుల్లాగానే మెలగుతున్నారు. కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేకంటే ముందు నుంచే ఈ పార్టీల మధ్య అవగాహన కుదిరిందని వార్తలు వచ్చాయి. వీటిని ఇరుపార్టీలు ఖండించలేదు. అలాగని అంగీకరించనూ లేదు. టీడీపీ మాత్రం ఈ విషయంలో ఇరుపార్టీలను ఇరుకున పెట్టాలని ప్రయత్నించినా అంతగా సఫలం కాలేకపోయింది. శత్రువు, శత్రువు మనకు మిత్రుడు అన్న సామెతను వీరిద్దరూ పాటిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో తమ పార్టీ నాయకులను పలు రకాలుగా ఇబ్బంది పెడుతోందని వైస్సార్‌సీపీ మొత్తుకుంటోంది. తెలంగాణలో ఆ పార్టీకి బలం అంతంతే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ తప్పకుండా టీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రతిగా వారి ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో అభివృద్ధి పనులకు రాష్ర్ట ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకోవాలన్న వ్యూహంలో ఉన్నట్లుంది. ఉమ్మడి శత్రువును ఇబ్బంది పెట్టేందుకు తప్పకుండా జగన్ టీఆర్ ఎస్‌కు మద్దతిస్తారని అంతా అనుకుంటున్నారు.
Advertisement