మండలి ఎన్నికకు ముందే టీడీపీకి దెబ్బ!
మండలి ఎన్నికలకు ముందే టీడీపీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు అనుమతించకూడదని ఆపార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదు. ఈ తీర్పుతో ఒక రకంగా వారు మండలి ఎన్నికల్లో ఓటమికి మానసికంగా సిద్ధమయ్యారనే చెప్పాలి. కొంతకాలంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను అధికారపార్టీ అన్యాయంగా వారి పార్టీలో చేర్చుకుంటుందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, […]
Advertisement
మండలి ఎన్నికలకు ముందే టీడీపీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు అనుమతించకూడదని ఆపార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదు. ఈ తీర్పుతో ఒక రకంగా వారు మండలి ఎన్నికల్లో ఓటమికి మానసికంగా సిద్ధమయ్యారనే చెప్పాలి. కొంతకాలంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను అధికారపార్టీ అన్యాయంగా వారి పార్టీలో చేర్చుకుంటుందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే! ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కాలె యాదయ్య, రెడ్యా నాయక్, విఠల్ రెడ్డి, కనకయ్యలు కొద్ది రోజుల క్రితం తెరాస పార్టీలో చేరారు. వీరి చేరికను సవాలు చేస్తూ తెలుగుదేశం అగ్రనేత ఎర్రబెల్లి, మరో కాంగ్రెస్ నేత సంపత్ కలిసి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ తీర్పుపై తెలుగుదేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాజాగా హైకోర్టు షాకివ్వడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ను కూడా న్యాయస్థానం డిస్మిస్ చేసింది. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయలేని తెలుగు తమ్ముళ్లకు న్యాయస్థానంలోనూ చుక్కెదురవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు.
మహానాడు వేదికపై నుంచి ఆగ్రహం..
దీంతో మహానాడు వేదికలపై నుంచి టీఆర్ ఎస్‌పై దుమ్మెత్తి పోస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. మరోవైపు టీఆర్ ఎస్ కూడా వీటికి దీటుగా నే జవాబిస్తోంది. ఏపీలో మీరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పుకానపుడు మేం చేస్తే ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. దీనికి వారి వద్ద సమాధానాలు లేకపోవడం గమనార్హం. ఏనాడూ క్షేత్రస్థాయిలో పోరాటాలు, ఉద్యమాలు చేసిన ఘనత టీడీపీ రికార్డులోనే లేదు. ఓయూ భూముల వ్యవహారాన్ని ఇంతకాలం పట్టించుకోని టీడీపీ నేతలు ఇప్పటి ఆ అంశాన్ని భుజాలకెత్తుకున్నారు. వాస్తవానికి ఓయూ విద్యార్థులు ఏనాడూ టీడీపీకి మద్దతు పలకలేదు. వారెప్పుడు ఉస్మానియా క్యాంపస్‌లో అడుగుపెట్టే సాహసం చేయలేదు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తరువాత టీటీడీపీ ఎమ్మెల్యేలు ఐకాసలో చేరి బయటికి వచ్చారు. తరువాత ఓయూ విద్యార్థులకు మద్దతుగా వెళ్లి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు. దీంతో విద్యార్థులు వారిని చితకబాదారు. అప్పటి నుంచి ఇక వారు ఓయూ తెలంగాణ ఉద్యమంలోగానీ, ఓయూవ్యవహారంలోగానీ తలదూర్చే సాహసం చేయ లేదు. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ ఓయూ అంశాన్ని లేవదీసి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ప్రజా సమస్యల కన్నా కేసీఆర్ పై వ్యతిరేకతనే తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెరపైకి ఐఎంజీ భూముల వ్యవహారం!
తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఐఎంజీ అనే సంస్థకు నామమాత్రపు రేటుకు కట్టబెట్టి చంద్రబాబు ఆ సంస్థకు ఆయాచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనిపై టీఆర్ ఎస్ దృష్టి పెట్టినట్లు సమాచారం. టీఆర్ ఎస్ నేతలు ఈ వ్యవహారానికి సంబంధించిన దస్త్రాల దుమ్ము దులిపే పనిలో పడ్డారని సమాచారం.ఈ దెబ్బతో టీడీపీ తమ్ముళ్లు మరింత ఆత్మరక్షణలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Advertisement