అబద్దాలు అందంగా చెప్పడం మోడీ నైజం: అజాద్
అబద్దాలను అందంగా చెప్పడం మోడికి బాగా తెలుసని కేంద్ర కాంగ్రెస్ నాయకుడు అజాద్ అన్నారు. యేడాది కాలంలో సొంత ప్రచారం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఒక పక్క రైలు ఛార్జీలు పెంచారు… మరో పక్క పెట్రోలు ధరలు పెంచారు. మోడీ ప్రభుత్వంలో ఏం ధరలు తగ్గాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని, అసలు వారికి స్వదేశీ, విదేశీ పయనాలు తప్ప పేద […]
Advertisement
అబద్దాలను అందంగా చెప్పడం మోడికి బాగా తెలుసని కేంద్ర కాంగ్రెస్ నాయకుడు అజాద్ అన్నారు. యేడాది కాలంలో సొంత ప్రచారం తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. ఒక పక్క రైలు ఛార్జీలు పెంచారు… మరో పక్క పెట్రోలు ధరలు పెంచారు. మోడీ ప్రభుత్వంలో ఏం ధరలు తగ్గాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని, అసలు వారికి స్వదేశీ, విదేశీ పయనాలు తప్ప పేద ప్రజల గురించి ఆలోచించే తీరికే లేదని ఆజాద్ విమర్శించారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గుతుంటే దేశంలో మాత్రం పెట్రో ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఈ బీజేపీ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తమ ఎమ్మెల్యేలపై నమ్మకముందని, తమకు లేనిదల్లా దొంగ ఓట్లు వేయించుకోవాలని చూసేవారిమీదేనని అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు కె.కె.ను జానా కలవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. రాజకీయం వేరు… వ్యక్తిగతం వేరు. నన్ను ఆహ్వానిస్తే చంద్రబాబు దగ్గరకైనా వెళతాను. కేసీఆర్ దగ్గరకైనా వెళతాను. వారితో తేనీరు సేవిస్తాను. ఇదేమీ తప్పుకాదే. రాజకీయాలను వ్యక్తిగత సంబంధాలతో ముడివేయరాదని అజాద్ అన్నారు.
Advertisement