‘అమరావతి’ ని ఆపలేం: పర్యావరణ ట్రిబ్యునల్‌

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంపై స్టే విధించాలన్న విజ్ఞప్తిని జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తిరస్కరించింది. పర్యావరణ ప్రభావ మదింపు జరపాలన్న అంశంపై విచారణను జూలై 27కి వాయిదా వేసింది. ఏపీ నూతన రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాలు సారవంతమైన సాగు భూములని, కృష్ణానది ఒడ్డున రాజధానిని నిర్మిస్తే వరదలు వస్తాయని కాబట్టి ఈ ప్రక్రియను నిలువరించి, పర్యావరణ ప్రభావ మదింపు జరిపించాలంటూ విజయవాడ వాసి పందలనేని శ్రీమన్నారాయణ ఎన్‌జీటీని ఆశ్రయించారు. జస్టిస్‌ […]

Advertisement
Update:2015-05-27 18:43 IST
ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంపై స్టే విధించాలన్న విజ్ఞప్తిని జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) తిరస్కరించింది. పర్యావరణ ప్రభావ మదింపు జరపాలన్న అంశంపై విచారణను జూలై 27కి వాయిదా వేసింది. ఏపీ నూతన రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాలు సారవంతమైన సాగు భూములని, కృష్ణానది ఒడ్డున రాజధానిని నిర్మిస్తే వరదలు వస్తాయని కాబట్టి ఈ ప్రక్రియను నిలువరించి, పర్యావరణ ప్రభావ మదింపు జరిపించాలంటూ విజయవాడ వాసి పందలనేని శ్రీమన్నారాయణ ఎన్‌జీటీని ఆశ్రయించారు. జస్టిస్‌ యూడీ సాల్వి, జస్టిస్‌ ఎన్‌ఎస్‌ నంబియార్‌, నిపుణులు డాక్టర్‌ దేవేంద్ర కుమార్‌ అగర్వాల్‌, ప్రొఫెసర్‌ ఏఆర్‌ యూసుఫ్‌, బిక్రంసింగ్‌ సజ్వన్‌తో కూడిన విస్తృత ధర్మాసనం వాద‌న‌లు విన్న త‌ర్వాత అమ‌రావ‌తి నిర్మాణాన్ని ఆప‌లేమ‌ని చెబుతూ కేసును వాయిదా వేసింది.
Tags:    
Advertisement

Similar News