ఏపీ రెవెన్యూ లోటు 14 వేల కోట్లు: కాగ్
రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీ రెవెన్యూ లోటు రూ.14 వేల కోట్లుగా కాగ్ లెక్క గట్టింది. గతేడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ నెలకు ఎంత మేరకు రెవెన్యూ లోటు వచ్చిందనే దానిపై కాగ్ పరిశీలించింది. ఇవన్నీ కలిపి ప్రభుత్వానికి ఓ నివేదిక రూపంలో కాగ్ అధికారులు అందజేశారు. అయితే ఈ మొత్తంలో నుంచి రూ.2,300 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి అందడంతో మిగతా మొత్తాన్ని కూడా ఇవ్వాలంటూ సీఎం […]
Advertisement
రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీ రెవెన్యూ లోటు రూ.14 వేల కోట్లుగా కాగ్ లెక్క గట్టింది. గతేడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ నెలకు ఎంత మేరకు రెవెన్యూ లోటు వచ్చిందనే దానిపై కాగ్ పరిశీలించింది. ఇవన్నీ కలిపి ప్రభుత్వానికి ఓ నివేదిక రూపంలో కాగ్ అధికారులు అందజేశారు. అయితే ఈ మొత్తంలో నుంచి రూ.2,300 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి అందడంతో మిగతా మొత్తాన్ని కూడా ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కేంద్ర ఆర్ధిక శాఖకు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక లోటును పూడ్చేందుకు కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాల్సిందిగా కోరుతూ కేంద్రానికి చీఫ్ సెక్రటరీ లేఖ రాశారు.
Advertisement