న‌ర‌క‌ కూపంలో భార్య‌, కూతురు

చెన్నైలోని పెరుంగుళత్తూర్ ప్రాంతంలో రామేశ్వర్  అనే ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నాడు. అత‌ను కొనుగోలు చేసిన ఓ అపార్ట్‌మెంట్ భార్య ప్రియాంకకు, కూతురికి బందీఖానాగా మారిపోయింది. కూతురుగా పుట్టినందుకు ఏకంగా టాయ్‌లెట్‌కు పరిమితం చేసి, బ‌తికించ‌డానికి అన్న‌ట్టు రోజుకు రెండు ఇడ్లీలు మాత్రం పెట్టేవాడు రామేశ్వర్. కొడుకుని మాత్రం చక్కగా తయారు చేసి రోజూ బడికి పంపుతున్నాడు. మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్న అతని భార్య ప్రియాంక (32) తమ పొరుగింటి వ్యక్తి సాయంతో వరంగల్‌లోని తన తల్లిదండ్రులకు […]

Advertisement
Update:2015-05-27 07:26 IST
చెన్నైలోని పెరుంగుళత్తూర్ ప్రాంతంలో రామేశ్వర్ అనే ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నాడు. అత‌ను కొనుగోలు చేసిన ఓ అపార్ట్‌మెంట్ భార్య ప్రియాంకకు, కూతురికి బందీఖానాగా మారిపోయింది. కూతురుగా పుట్టినందుకు ఏకంగా టాయ్‌లెట్‌కు పరిమితం చేసి, బ‌తికించ‌డానికి అన్న‌ట్టు రోజుకు రెండు ఇడ్లీలు మాత్రం పెట్టేవాడు రామేశ్వర్. కొడుకుని మాత్రం చక్కగా తయారు చేసి రోజూ బడికి పంపుతున్నాడు. మూడేళ్లుగా నరకం అనుభవిస్తున్న అతని భార్య ప్రియాంక (32) తమ పొరుగింటి వ్యక్తి సాయంతో వరంగల్‌లోని తన తల్లిదండ్రులకు స‌మాచారం పంపించి ఎట్టకేలకు ఈ నరకం నుంచి బయటపడింది. మగజాతికే మచ్చ తెచ్చేలా ఆ నీచుడు చేసిన ఈ దారుణాన్ని తల్చుకుంటే ఎవరికైనా కడుపు రగిలిపోతుంది. ఈ న‌ర‌రూప రాక్ష‌సుడి నేపథ్యాన్ని గమనిస్తే… వరంగల్‌కు చెందిన ప్రియాంకకు 2004లో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రామేశ్వర్‌తో పెళ్లయింది. కొన్నాళ్లకు ప్రియాంక గర్భవతి కాగానే స్కాన్ చేయించాడు. ఆమె గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో గర్భస్రావం చేయించుకోవాలని ఒత్తిడి చేశారు. ప్రియాంక అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత విడాకుల కోసం ఒత్తిడి చేశాడు. అయితే ఫ్యామిలీ కౌన్సిలర్ల జోక్యంతో వెనక్కి తగ్గాడు. ఈ క్రమంలో పాప‌తో పాటు ప్రియాంక ఒక అబ్బాయికి కూడా జన్మనిచ్చింది. ఆ త‌ర్వాత‌యినా కష్టాలు తగ్గుతాయని ఆమె భావించింది కానీ, పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోయాయి. అందుకు కారణం… రామేశ్వర్ తల్లి, తమ్ముడు కూడా వచ్చి చేరారు. చివరికి అతికష్టం మీద పొరుగువారి ద్వారా తాంబరం ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్‌కు ప్రియాంక ఫోన్ చేసి ఈ భూత గృహం నుంచి బయటపడింది. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News