రహస్య ఖాతాలకు కాలం చెల్లింది: అరుణ్ జైట్లీ
నల్ల ధన స్వాముల రహస్య విదేశీ ఖాతాలకు ఇక కాలం చెల్లిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారతీయులు ఏ దేశంలో అక్రమ ఆస్తులు కూడబెట్టినా ఇక వాటికి ఏ మాత్రం భద్రత ఉండదన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాంటి ఖాతాల వివరాలు ఇచ్చిపుచ్చుకోవడమే ఇందుకు కారణమన్నారు. 2017 నాటికి ఇలాంటి సమాచారం ఎప్పటికపుడు తెలుస్తుందన్నారు. నల్ల ధన నిరోధక బిల్లు చట్టం కాకముందే విదేశాల్లో అక్రమంగా ఆస్తులు, బ్యాంకు ఖాతాలున్న వారు వాటి వివరాలు వెల్లడించి […]
Advertisement
నల్ల ధన స్వాముల రహస్య విదేశీ ఖాతాలకు ఇక కాలం చెల్లిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారతీయులు ఏ దేశంలో అక్రమ ఆస్తులు కూడబెట్టినా ఇక వాటికి ఏ మాత్రం భద్రత ఉండదన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఇలాంటి ఖాతాల వివరాలు ఇచ్చిపుచ్చుకోవడమే ఇందుకు కారణమన్నారు. 2017 నాటికి ఇలాంటి సమాచారం ఎప్పటికపుడు తెలుస్తుందన్నారు. నల్ల ధన నిరోధక బిల్లు చట్టం కాకముందే విదేశాల్లో అక్రమంగా ఆస్తులు, బ్యాంకు ఖాతాలున్న వారు వాటి వివరాలు వెల్లడించి పన్నులు చెల్లించాలని కోరారు. లేకపోతే వారిపై చర్యలు తప్పవని జైట్లీ హెచ్చరించారు.
Advertisement