ఎంపీ లాడ్స్ నుంచి చిల్లిగవ్వ వాడని ఎంపీలు
‘‘ఎంపీల్యాడ్స్ నిధులను విరివిగా ఉపయోగించండి. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా.. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు కట్టించండి’’ అని ఏడాది క్రితం మోడీ ఇచ్చిన పిలుపును ఎంపీలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎంపీల సంగతి సరే.. చాలా మంది కేంద్ర మంత్రులూ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి ఒక్క రూపాయీ వాడలేదు. కేంద్ర గణాంక, పథకాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 55 శాతం మంది ఎంపీలు తమకు కేటాయించిన నిధుల నుంచి ఒక్కపైసా […]
Advertisement
‘‘ఎంపీల్యాడ్స్ నిధులను విరివిగా ఉపయోగించండి. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా.. గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్లు కట్టించండి’’ అని ఏడాది క్రితం మోడీ ఇచ్చిన పిలుపును ఎంపీలు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎంపీల సంగతి సరే.. చాలా మంది కేంద్ర మంత్రులూ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి ఒక్క రూపాయీ వాడలేదు. కేంద్ర గణాంక, పథకాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 55 శాతం మంది ఎంపీలు తమకు కేటాయించిన నిధుల నుంచి ఒక్కపైసా వినియోగించలేదని తేలింది. ఇందులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అనంతకుమార్, సదానందగౌడ, కల్రాజ్ మిశ్రా, ఉమాభారతితోపాటు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ములాయం సింగ్ యాదవ్ వంటి సీనియర్ పార్లమెంటేరియన్లు చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో ఆంద్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, గోకరాజు గంగరాజు తదితరులున్నారు. అయితే.. జిల్లా అధికారులకు నివేదికలిచ్చినా.. వారు ఆలస్యంగా స్పందిస్తుండటం వల్లే నిధులు మిగిలిపోతున్నాయని కొందరు ఎంపీలు తెలిపారు. నియోజకవర్గంలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రోడ్లు.. మొదలైన అవసరాలు తీర్చేందుకు ఒక్కో ఎంపీకి ఐదు కోట్ల రూపాయలిస్తారు. ఎంపీ సిఫారసు మేరకు జిల్లా కలెక్టర్ ఆమోదించటం ద్వారా ఈ నిధులను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక ఏడాదిలో వీటిని ఖర్చు చేయకపోతే.. వచ్చే ఏడాదికి కొత్త లెక్కతోపాటు వీటిని కూడా కలిపే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.
Advertisement