శ్రీచక్ర గోల్డ్, అవనీ గోల్డ్ ఆస్తుల జప్తునకు అనుమతి
విశాఖ జిల్లాకు చెందిన శ్రీచక్ర గోల్డ్ ఫార్మ్ అండ్ విల్లాస్ ప్రైవేటు లిమిటెడ్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అవనీ గోల్డ్ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల ఆస్తులు జప్తు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పి.మాల్యాద్రి సహా నలుగురు వ్యక్తులు 2011లో ప్రభుత్వ అనుమతి పొందకుండానే అవనీ గోల్డ్ సంస్థను ప్రారంభించారు. అధిక వడ్డీ ఆశ చూపి 46 వేల మంది నుంచి రూ.19 కోట్లు […]
Advertisement
విశాఖ జిల్లాకు చెందిన శ్రీచక్ర గోల్డ్ ఫార్మ్ అండ్ విల్లాస్ ప్రైవేటు లిమిటెడ్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అవనీ గోల్డ్ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల ఆస్తులు జప్తు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పి.మాల్యాద్రి సహా నలుగురు వ్యక్తులు 2011లో ప్రభుత్వ అనుమతి పొందకుండానే అవనీ గోల్డ్ సంస్థను ప్రారంభించారు. అధిక వడ్డీ ఆశ చూపి 46 వేల మంది నుంచి రూ.19 కోట్లు వసూలు చేశారు. సంస్థకు చెందిన 79.4 ఎకరాల భూమిని జప్తు చేయాల్సిందిగా హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నాలుగేళ్లలో రెట్టింపు మొత్తం ఇస్తామంటూ శ్రీచక్రగోల్డ్ సంస్థ పుట్టుకొచ్చింది. దాదాపు 32 వేల మంది ఖాతాదారుల నుంచి రూ.15.18 కోట్లు వసూలు చేసింది. విశాఖ కమీషనరేట్ విజ్ఞప్తి మేరకు సంస్థకు చెందిన దాసరి అరుణ, ఆమె భర్త నరేంద్ర, సోదరుడు అనిల్‌కుమార్‌ల స్థిర, చరాస్తులను జప్తునకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
Advertisement