ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం
ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ సభ్యులు ముగ్గుర్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ నిర్ణయించారు. దీనికి సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో కొంచెం సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సభా కార్యక్రమాలకు అడుగడుగునా వారు అడ్డు పడడంతో సభ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ వెంటనే సభ నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించడంతో సభ్యులు స్పీకర్ మాటలు పట్టించుకోకుండా సభలోనే మొరాయించి కూర్చున్నారు. బహిష్కరణకు గురైన సభ్యులు ఎంతకూ సభ […]
Advertisement
ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ సభ్యులు ముగ్గుర్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ నిర్ణయించారు. దీనికి సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో కొంచెం సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సభా కార్యక్రమాలకు అడుగడుగునా వారు అడ్డు పడడంతో సభ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. ఆ వెంటనే సభ నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించడంతో సభ్యులు స్పీకర్ మాటలు పట్టించుకోకుండా సభలోనే మొరాయించి కూర్చున్నారు. బహిష్కరణకు గురైన సభ్యులు ఎంతకూ సభ నుంచి బయటికి వెళ్ళకపోవడంతో స్పీకర్ మార్షల్స్‌ని పిలిచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. సంప్రదాయానికి భిన్నంగా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ని విమర్శించిన స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ సభ్యుల డిమాండుతో అసలు సమస్య మొదలయ్యింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు తీవ్ర ఆక్షేపణ చెప్పారు. రెచ్చిపోయిన బీజేపీ సభ్యులు గందరగోళ పరిస్థితులు సృష్టించడంతో ముగ్గురిపై బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు.
Advertisement