తెలంగాణలో అరాచక పాలన: కాంగ్రెస్ ఆరోపణ
తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని, రాజకీయ నాయకుల మీదే దాడికి దిగారంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నారని, తన నియోజకవర్గంలో నిరంజన్‌రెడ్డికి తెలంగాణ ప్లానింగ్ బోర్డులో ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చిన తర్వాత ఆయన దాడులను ప్రోత్సహిస్తున్నాడని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి జి. చిన్నారెడ్డి ఆరోపించారు. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరూ తన మీద ఎవరూ చేయి […]
Advertisement
తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని, రాజకీయ నాయకుల మీదే దాడికి దిగారంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నారని, తన నియోజకవర్గంలో నిరంజన్‌రెడ్డికి తెలంగాణ ప్లానింగ్ బోర్డులో ఉపాధ్యక్షుడి పదవి ఇచ్చిన తర్వాత ఆయన దాడులను ప్రోత్సహిస్తున్నాడని వనపర్తి ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి జి. చిన్నారెడ్డి ఆరోపించారు. 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరూ తన మీద ఎవరూ చేయి వేయలేదని, అలాంటిది ఏకంగా ఇపుడు దాడి చేసి గాయ పరిచారని ఆయన తనకు అయిన గాయాలను గవర్నర్‌కు చూపించారు. తన జీవితంలో ఇది దుర్ధినమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చిన్నారెడ్డి వాపోయారు. కేసీఆర్ నియంతలా పాలిస్తున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్దంగా పరిపాలన సాగడం లేదని, కేవలం కుటుంబ పాలన మాత్రమే సాగుతోందని టి-కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇలా దాడులు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. పార్లమెంటరీ కార్యదర్శులను తక్షణం తొలగించాలని, వారికి కేబినెట్ హోదా ఇవ్వడం సరికాదని హైకోర్టు తీర్పు చెప్పినా వారు ఇంకా పదవుల్లో కొనసాగుతూనే ఉన్నారని, చట్టం పట్ల, కోర్టుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం తెలుస్తుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
Advertisement