అంతులేని సెక్యూరిటీ మధ్య‌ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్

నవ్యాంధ్ర రాజధానిలో జూన్ 2వ తేదీ నుంచి కొలువుదీరేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్ కు అతిసమీపంలో స్వరాజ్య మైదానానికి పక్కనే ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ పర్యవేక్షిస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం ఉండే ఏరియా మొత్తాన్ని ఒక జోన్ కిందకు మార్చి భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. విజయవాడ నగర పౌరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబుకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఏపీ సీఎం […]

Advertisement
Update:2015-05-26 07:18 IST

నవ్యాంధ్ర రాజధానిలో జూన్ 2వ తేదీ నుంచి కొలువుదీరేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్ కు అతిసమీపంలో స్వరాజ్య మైదానానికి పక్కనే ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ పర్యవేక్షిస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం ఉండే ఏరియా మొత్తాన్ని ఒక జోన్ కిందకు మార్చి భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. విజయవాడ నగర పౌరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబుకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దేశంలోనే అత్యంత ఉన్నతస్థాయి భద్రతా వలయంలో ఉండే అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారు. చంద్రబాబుకు జడ్ ఫ్లస్ కేటగిరీ భద్రతతోపాటు, నేషనల్ సెక్యూరిటీ గార్డులకు చెందిన బ్లాక్ క్యాట్ కమాండోస్, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జామర్లు, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, మెటల్ డిటెక్టర్లు వంటి అనేక రకాల భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. సీఎం వారానికి మూడ్రోజులు విజయవాడలో ఉండనున్నారు. స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొవడంతోపాటు హైద్రాబాద్ కు రాకపోకలు సాగించనున్నారు. విజయవాడలో ఉంటూనే ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే ఇందిరాగాంధీ స్టేడియంలో హెలిపాడ్ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ లో వెళ్లే ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

సీఎం క్యాంపు కార్యాలయ పరిధి మొత్తం ఒకవైపు న్యాయస్థానాల సముదాయం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహం, ఇంకోవైపు స్వరాజ్యమైదానం వంటివి ఉన్నాయి. ఇటువంటి కూడలిలో సీఎం క్యాంపు కార్యాలయం ఉంది. ఈ ప్రాంతమంతా నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికితోడు సీఎంను కలిసేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజలు వేలాది మందిగా ఉంటారు. ఈ ప్రాంతాన్ని సెక్యూరిటీ జోన్ పరిధిలోకి తేచ్చేందుకు నిర్ణయించారు. అత్యంత శక్తివంతమైన సీసీ కెమెరాలను ఈ ప్రాంతమంతా ఏర్పాటు చేసి క్యాంపు కార్యాలయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేయనున్నారు. ఇక ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకురానున్నారు. సీఎం ఉన్న సమయంలో వీటిని పటిష్టంగా అమలు చేయనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి దారితీసే రహదారులన్నింటిలో సెంట్రీ పోస్టులు, వచ్చిపోయే వారి కదలికలపై నిఘా ఉంచుతారు. క్యాంపు కార్యాలయం వద్ద క్విక్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేయనున్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, లా అండ్ ఆర్డర్, క్రైం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ తోపాటు నిరంతర గస్తీ తిరుగుతుంటారు. సీఎం క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్లే మార్గంలో ముఖద్వారం వద్ద పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా అనుమతి తీసుకున్న వారిని, రెగ్యులర్ పాసులున్న వారిని మాత్రమే అనుమతించనున్నారు.

క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల సమీక్షా సమావేశాలుంటే ఆ అధికారుల జాబితా ముందుగానే భద్రతాధికారులకు అందిస్తారు. జాబితా ఆధారంగానే లోపలికి అధికారులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతారు. క్యాంపు కార్యాలయం వద్దకు వివిధ ప్రజాసంఘాలు లేదా ప్రతిపక్షాలు ఎవరైనా నిరసన, ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తే నిర్ణీత దూరంలోనే నిలిపివేయనున్నారు. అపాయింట్ మెంట్ ఉన్న కొద్ది మందిని మాత్రమే క్యాంపు కార్యాలయానికి అనుమతిస్తారు. సీఎంను కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక హాల్స్ ఏర్పాటు చేశారు. సీఎం ఆయా హాల్స్ కు వచ్చి వారిని కలుసుకునే ముందు వారందరినీ తనిఖీ చేసిన తరువాతనే లోపలికి అనుమతిస్తారు.

దాదాపు కొన్ని నెలలపాటు సీఎం రాత్రి సమయాల్లో క్యాంపు కార్యాలయంలోనే బస చేస్తారని అంటున్నారు. 24 గంటలూ నిరంతరం భద్రతలో క్యాంపు కార్యాలయాన్ని ఉంచనున్నారు. క్యాంపు కార్యాలయానికి అతిసమీపంలో డీజీపీ క్యాంపు కార్యాలయం ఉంది. మరో నెల రోజుల్లో డీజీపీ కార్యాలయం పనులు పూర్తయ్యే అవకాశముంది. ఈ రెండు కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాల్సిన బందోబస్తుపై స్థానిక పోలీస్ అధికారులతో సీఎం భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News