ప్రభుత్వంతో 108 ఉద్యోగుల చర్చలు సఫలం
ప్రభుత్వంతో 108 ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన హామీతో సమ్మెను విరమిస్తున్నామని ఉద్యోగులు చెప్పారు. తక్షణమే వెయ్యి రూపాయల వేతనం పెంపుకు మంత్రి అంగీకరించినట్లు స్పష్టం చేశారు. రేపటి నుంచి విధుల్లో చేరతామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటానికి మంత్రి రెండు నెలల గడువు కోరారు. సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. సమ్మె కాలానికి జీతం ఇచ్చే అంశంపై జీవీకే యాజమాన్యంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. […]
Advertisement
ప్రభుత్వంతో 108 ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన హామీతో సమ్మెను విరమిస్తున్నామని ఉద్యోగులు చెప్పారు. తక్షణమే వెయ్యి రూపాయల వేతనం పెంపుకు మంత్రి అంగీకరించినట్లు స్పష్టం చేశారు. రేపటి నుంచి విధుల్లో చేరతామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటానికి మంత్రి రెండు నెలల గడువు కోరారు. సమస్యల పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. సమ్మె కాలానికి జీతం ఇచ్చే అంశంపై జీవీకే యాజమాన్యంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 108 ఉద్యోగులు 11 రోజుల పాటు సమ్మె చేశారు. దీని ఫలితంగానే వారికి పాక్షికంగా లబ్ధి చేకూరింది.
Advertisement