మావోయిస్టుగా ఉండటం తప్పుకాదు : కేరళ హైకోర్టు

ఎవరైనా ఒక వ్యక్తి మావోయిస్టు కావడం తప్పు కాదని, ఆ వ్యక్తి మావోయిస్టు అనే ఒకే ఒక్క కారణంతో పోలీసులు నిర్బంధించకూడదని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘‘మావోయిస్టు కావడం నేరం కాదు. మావోయిస్టుల రాజకీయ సిద్ధాంతం రాజ్యాంగంతో ఏకీభవించకపోయినప్పటికీ.. మానవ ఆకాంక్షల ప్రకారం ప్రతి వ్యక్తికీ సొంతంగా ఆలోచించుకునే హక్కుంటుంది’’ అని పేర్కొంది. అయితే, (మావోయిస్టు) వ్యక్తులు కానీ, సంస్థలు కానీ హింసకు పాల్పడినట్టు తేలితేనే చర్యలు తీసుకోవచ్చు అని జస్టిస్‌ ఎ.మహ్మద్‌ ముస్తాక్‌ పేర్కొన్నారు. మావోయిస్టు […]

Advertisement
Update:2015-05-23 07:11 IST
ఎవరైనా ఒక వ్యక్తి మావోయిస్టు కావడం తప్పు కాదని, ఆ వ్యక్తి మావోయిస్టు అనే ఒకే ఒక్క కారణంతో పోలీసులు నిర్బంధించకూడదని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ‘‘మావోయిస్టు కావడం నేరం కాదు. మావోయిస్టుల రాజకీయ సిద్ధాంతం రాజ్యాంగంతో ఏకీభవించకపోయినప్పటికీ.. మానవ ఆకాంక్షల ప్రకారం ప్రతి వ్యక్తికీ సొంతంగా ఆలోచించుకునే హక్కుంటుంది’’ అని పేర్కొంది. అయితే, (మావోయిస్టు) వ్యక్తులు కానీ, సంస్థలు కానీ హింసకు పాల్పడినట్టు తేలితేనే చర్యలు తీసుకోవచ్చు అని జస్టిస్‌ ఎ.మహ్మద్‌ ముస్తాక్‌ పేర్కొన్నారు. మావోయిస్టు అనే అనుమానంతో కేరళ పోలీసులు శ్యామ్‌ బాలకృష్ణన్‌ అనే వ్యక్తిని గత ఏడాది అరెస్టు చేశారు. కొన్ని గంటల తర్వాత విడిచిపెట్టారు. ఒక మాజీ న్యాయమూర్తి కుమారుడైన బాలకృష్ణన్‌ ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో పోలీసులు తనను వేధిస్తున్నారని, తనను అరెస్టు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. వ్యక్తుల వ్యక్తిగత ఆలోచనలు, భావాలు ప్రజావిలువలకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రమే అవి చట్టవిరుద్ధమవుతాయని స్పష్టం చేసింది. శ్యామ్‌ బాలకృష్ణన్‌ను అరెస్టు చేయడం ద్వారా అతడి స్వేచ్ఛను పోలీసులు హరించారని మండిపడింది. రెండు నెలల్లోగా రూ.లక్ష పరిహారం ఇవ్వాలని, దాంతోపాటు కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు చెల్లించాలని ఆదేశించింది. అదే సమయంలో.. తనను అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా శ్యామ్‌ బాలకృష్ణన్‌ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అతణ్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని సమర్థించిన ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరునూ ధర్మాసనం తప్పుపట్టింది.
Tags:    
Advertisement

Similar News