హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి 12 దాకా హోటళ్లు
రాజధాని వాసులకు శుభవార్త. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో అర్ధరాత్రి 12 దాకా భోజనం లభించనుంది. నగరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం రాత్రి 10 గంటల తరువాత హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం లభించేది కాదు. ఈ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు హోమంత్రి నాయిని నరసింహారెడ్డి శనివారం వెల్లడించారు. అయితే, పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో […]
Advertisement
రాజధాని వాసులకు శుభవార్త. ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లలో అర్ధరాత్రి 12 దాకా భోజనం లభించనుంది. నగరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం రాత్రి 10 గంటల తరువాత హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం లభించేది కాదు. ఈ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు హోమంత్రి నాయిని నరసింహారెడ్డి శనివారం వెల్లడించారు. అయితే, పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Advertisement