ఏపీకి కదలండి...మంత్రులకు చంద్రబాబు డెడ్‌లైన్!
మంత్రులు త్వరగా బయలుదేరి రాజధానికి వెళ్ళిపోండి… క్యాంపు కార్యాలయాలు ఎవరికి వారు చూసుకోవాల్సిందే.. సాధ్యమైనంత వరకు అక్కడ మీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోండి…’’ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు చేసిన హితబోధ. కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు తాత్కాలిక రాజధాని విజయవాడకు వచ్చేనెల మొదటి వారంలో తరలివస్తుండటంతో మంత్రివర్గ సహచరులను కూడా వీలైనంత త్వరగా విజయవాడ, గుంటూరులో కార్యాలయాలను ఏర్పాటు […]
Advertisement
మంత్రులు త్వరగా బయలుదేరి రాజధానికి వెళ్ళిపోండి… క్యాంపు కార్యాలయాలు ఎవరికి వారు చూసుకోవాల్సిందే.. సాధ్యమైనంత వరకు అక్కడ మీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోండి…’’ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులకు చేసిన హితబోధ. కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు తాత్కాలిక రాజధాని విజయవాడకు వచ్చేనెల మొదటి వారంలో తరలివస్తుండటంతో మంత్రివర్గ సహచరులను కూడా వీలైనంత త్వరగా విజయవాడ, గుంటూరులో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే దేవినేని ఉమ, తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఇరువురు మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్రలు తమ కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక గుంటూరు జిల్లా మంత్రులు కూడా తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు సంసిద్దులవుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుండటంతో ఇక ప్రభుత్వ పాలన రాజధాని నుంచి జరగాల్సిందేనని సీఎం పట్టుడుతున్నారు. రాజధానికి తరలిరావడం లేదని ఇప్పటికే సీమాంధ్ర ప్రజల్లో అసంతృప్తి ఉందని, విజయవాడకు 300 కిలో మీటర్లు దూరంలో ఉన్న హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించడాన్ని ప్రజలు జీర్ణిచించుకోలేకపోతున్నారని గూఢచారి వర్గాల ద్వారా ప్రభుత్వానికి సమాచారం అందింది. సీమాంధ్రుల మనోభావాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు విజయవాడలో తన కార్యాలయాన్ని సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు. ఒక్కసారి సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తే ఇక మంత్రులు కూడా ఇక్కడ మకాం వేయాల్సి ఉంటుంది. శాఖల సమీక్ష, వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉండటంతో మంత్రులు, అధికారులు విజయవాడకు రావాల్సి ఉంటుంది. అందువలనే మంత్రులందరూ జూన్ మాసాంతంలోపు తమ క్యాంపు కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్టు తెలిసింది.
Advertisement