సీఎం...డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం!
అభివృద్ధి విషయంలో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి, సీంఎ చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. కర్నూలును సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని కెఈ అనగా… రాష్ట్రంలో అన్ని విధాలా కర్నూలు అభివృద్ధి జరుగుతోందని, దీన్ని నిరూపిస్తానని సీఎం చంద్రబాబు సవాలు విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెడుతున్నారని, కర్నూలును […]
అభివృద్ధి విషయంలో డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి, సీంఎ చంద్రబాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. కర్నూలును సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని కెఈ అనగా… రాష్ట్రంలో అన్ని విధాలా కర్నూలు అభివృద్ధి జరుగుతోందని, దీన్ని నిరూపిస్తానని సీఎం చంద్రబాబు సవాలు విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెడుతున్నారని, కర్నూలును ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాబు తీరుపై తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్త పరిచారు. కర్నూలులో మూడు సీట్లలో మాత్రమే గెలవడంలో తమ తప్పు లేదన్నారు. జిల్లా పార్టీ నూతన పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డికి ఆ పదవి కట్టబెట్టడం చంద్రబాబు సాహసంతో కూడిన నిర్ణయమని, కర్నూలులో ఏ వీధి ఎక్కడుందో ఆయనకు సరిగా తెలియదని కేఈ వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇదే తరహాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత జిల్లా చిత్తూరును సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని, కేవలం విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒకరి తరువాత ఒకరు ఇలా చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఇపుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
డిప్యూటీ సీఎంకి చంద్రబాబు సవాల్
చంద్రబాబు కూడా అంతే ధీటుగా కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు. కర్నూలు జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అక్కడికి గతంలో ఎన్నడూ లేని విధంగా పరిశ్రమలు, విద్యాసంస్థలు, అభివృద్ధి పథకాలు వస్తున్నాయని తెలిపారు. తనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఒకేటేనని, అన్ని సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటానని అన్నారు. ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయబోనని, మంత్రులకుగాని, ఎమ్మెల్యేలకుగాని ఏమైనా సందేహాలుంటే తనకు చెప్పాలని, అంతేగాని ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయవద్దని ఉప ముఖ్యమంత్రి కేఈకి పరోక్షంగా సవాలు విసిరారు.