పాలమూరులో శ‌తాధిక సామూహిక వివాహాలు..

మహబూబ్ నగర్ జిల్లా సామూహిక శ‌తాధిక వివాహాల‌కు వేదిక‌య్యింది. ఎంజేఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్ర‌వారం నాగర్‌కర్నూల్‌లో జ‌రిగిన సామూహిక వివాహాలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో పాటు పలువురు తెలంగాణ మంత్రులు హాజ‌ర‌యి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. శుక్రవారం ఉదయం 11.05 గంటలకు కర్కాటక లగ్నంలో వేద పండితులచే సాంప్రదాయబద్ధంగా 102 మంది పేద జంటలకు వివాహాలు జ‌రిగాయి. ఈసందర్భంగా నిర్వాహకులు సంగీత విభావరి ఏర్పాటు చేశారు. వివాహాల‌కు కొత్త శోభ‌ను తెచ్చేందుకు రాత్రి పొద్దుపోయే […]

Advertisement
Update:2015-05-21 18:38 IST
మహబూబ్ నగర్ జిల్లా సామూహిక శ‌తాధిక వివాహాల‌కు వేదిక‌య్యింది. ఎంజేఆర్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్ర‌వారం నాగర్‌కర్నూల్‌లో జ‌రిగిన సామూహిక వివాహాలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో పాటు పలువురు తెలంగాణ మంత్రులు హాజ‌ర‌యి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. శుక్రవారం ఉదయం 11.05 గంటలకు కర్కాటక లగ్నంలో వేద పండితులచే సాంప్రదాయబద్ధంగా 102 మంది పేద జంటలకు వివాహాలు జ‌రిగాయి. ఈసందర్భంగా నిర్వాహకులు సంగీత విభావరి ఏర్పాటు చేశారు. వివాహాల‌కు కొత్త శోభ‌ను తెచ్చేందుకు రాత్రి పొద్దుపోయే వరకూ కళ్యాణ వేదికను అలంకరించారు. వేలాది మంది హాజ‌ర‌వుతార‌న్న ముందు చూపుతో ఏర్పాట్ల‌ను ఘ‌నంగా చేశారు. ప్రజలకు ఎండ నుంచి రక్షించేందుకు గ్రౌండ్‌లో టెంట్లు వేశారు. కూలర్లు, ఫ్యాన్లు, మంచినీటి సౌకర్యం కల్పించారు. పెళ్లి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సామూహిక శ‌తాధిక వివాహాల‌కు భ‌క్తి ర‌సం కూడా జోడించారు. ఈ వివాహ వేడుక‌కు సీతారామస్వామివార్ల కళ్యాణోత్సవం కూడా తోడ‌య్యింది. వీఐపీలు మధ్యలో కూర్చునేలా ఇరు వైపులా జంటల వివాహాలు జరిగేలా మండపాన్ని తీర్చిదిద్దారు.
Tags:    
Advertisement

Similar News