సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్... దొంగల చేతివాటం..
రైళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. మూడు రైళ్లలో దోపిడికి పాల్పడిన ఘటన మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాలో దొంగలు చేతివాటం ప్రదర్శించి సుమారు 60 తులాల బంగారు నగలు దొంగిలించి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. వివరాల్లోకి వెళితే కడప నగరం మేదరి వీధికి చెందిన పర్వష్ కుటుంబం హైదరాబాద్‌లో వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో సంపర్క్ క్రాంతి ట్రైన్‌లో కడప రైల్వే స్టేషన్‌లో దిగారు. కడప వస్తుందనగా కంపార్ట్‌మెంట్ డోర్ […]
Advertisement
రైళ్లలో దొంగలు రెచ్చిపోతున్నారు. మూడు రైళ్లలో దోపిడికి పాల్పడిన ఘటన మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లాలో దొంగలు చేతివాటం ప్రదర్శించి సుమారు 60 తులాల బంగారు నగలు దొంగిలించి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమన్నారు. వివరాల్లోకి వెళితే కడప నగరం మేదరి వీధికి చెందిన పర్వష్ కుటుంబం హైదరాబాద్‌లో వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో సంపర్క్ క్రాంతి ట్రైన్‌లో కడప రైల్వే స్టేషన్‌లో దిగారు. కడప వస్తుందనగా కంపార్ట్‌మెంట్ డోర్ వద్దకు వచ్చారు. కమలాపురం రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన కొందరు దొంగలు బ్యాగులు దించేందుకు సహాయం చేస్తున్నట్లుగా నటించి నగలు ఉన్న బ్యాగ్ తీసుకొని పరారయ్యారు. దీంతో బాధితులు కడప రైల్వే పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడ ఎవ్వరూ లేరు. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కూడా సకాలంలో స్పందించ లేదని బాధితులు వాపోతున్నారు. దొంగలను పట్టుకుని తమ నగలు తమకు ఇప్పించాలని కోరుతున్నారు.
Advertisement