చాలాకాలం తరువాత వార్తల్లో తెలుగు గవర్నర్!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలుగువాడు అయిన తమిళనాడు గవర్నర్ రోశయ్య చాలారోజుల తరువాత మళ్లీ వార్తల్లో కెక్కారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తరువాత ఆయన తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అడపాదడపా తిరుపతి దర్శనానికి వస్తన్న ఆయన గతకొంతకాలంగా వార్తల్లో కనిపించ లేదు. జయలలిత రాజీనామా, తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కొంతకాలంపాటు తెరమీద కనిపించిన ఆయన తరువాత పెద్దగా మీడియాలో కనిపించలేదు. ఇప్పడు జయలలిత […]
Advertisement
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలుగువాడు అయిన తమిళనాడు గవర్నర్ రోశయ్య చాలారోజుల తరువాత మళ్లీ వార్తల్లో కెక్కారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తరువాత ఆయన తమిళనాడు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. అడపాదడపా తిరుపతి దర్శనానికి వస్తన్న ఆయన గతకొంతకాలంగా వార్తల్లో కనిపించ లేదు. జయలలిత రాజీనామా, తరువాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కొంతకాలంపాటు తెరమీద కనిపించిన ఆయన తరువాత పెద్దగా మీడియాలో కనిపించలేదు. ఇప్పడు జయలలిత ప్రమాణ స్వీకారంతో మరోసారి మీడియాకు దర్శనమీయనున్నారు.
Advertisement