భూమిపై కొత్త దీవి జననం!
భూమిపై అప్పుడప్పుడూ కొత్త జీవులు వెలుగులోకి వస్తుంటాయి. ఇదేంటి..! “కొత్త దీవి విచిత్రంగా ఉంది.. అనుకుంటున్నారా?” ఇప్పుడు భూమిపై ఉన్న దీవులకు తోడుగా మరో దీవి పుడుతోంది. ఎక్కడో కాదు.. జపాన్ దేశంలోని పసిఫిక్ సుమద్ర తీరంలో! 2013, నవంబరులో ఇక్కడి ‘ఒగసావరా’ ద్వీపసముదాయానికి సమీపంలో సముద్రగర్భంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని నుంచి ఇప్పటి వరకు లావా వెలువడుతూనే ఉంది. ఇప్పటి దాకా వెలువడిన ఆ లావా చల్లబడి అక్కడ రాతిని పోలిన నేలను ఏర్పరించింది. […]
Advertisement
భూమిపై అప్పుడప్పుడూ కొత్త జీవులు వెలుగులోకి వస్తుంటాయి. ఇదేంటి..! “కొత్త దీవి విచిత్రంగా ఉంది.. అనుకుంటున్నారా?” ఇప్పుడు భూమిపై ఉన్న దీవులకు తోడుగా మరో దీవి పుడుతోంది. ఎక్కడో కాదు.. జపాన్ దేశంలోని పసిఫిక్ సుమద్ర తీరంలో! 2013, నవంబరులో ఇక్కడి ‘ఒగసావరా’ ద్వీపసముదాయానికి సమీపంలో సముద్రగర్భంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని నుంచి ఇప్పటి వరకు లావా వెలువడుతూనే ఉంది. ఇప్పటి దాకా వెలువడిన ఆ లావా చల్లబడి అక్కడ రాతిని పోలిన నేలను ఏర్పరించింది. అంటే అక్కడ సముద్రంలో కొత్త దీవి వెలిసింది. దీనికి ‘నిష్‌నోషిమా’ అనే పేరు కూడా పెట్టారు.ఇది సరిగ్గా జపాన్ రాజధాని అయిన టోక్యోకు దక్షిణాన 1000 కిలోమీటర్ల దూరంలో ఏర్పడుతోంది. ప్రస్తుతం 2.46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ దీవిలోని అగ్నిపర్వతం ఇంకా పేలుతూనే ఉంది. ఎప్పుడు ఆగుతుందో శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. దీంతో దీని వైశాల్యం మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న సముద్రపక్షులు ఇప్పుడిప్పుడే దీనిపై విరామం తీసుకుంటున్నాయి. వీటి వ్యర్థాలు, రెట్టల వల్ల ఇక్కడ వృక్షజాతులు, ఫంగస్, బాక్టీరియా అభివృద్ధి చెందుతాయి. దీంతో ఈ దీవిపై జరిగే పరిణామాలను అధ్యయనం చేస్తే, భూమిపై మనిషి పుట్టుకకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా ఉన్నారట.
Advertisement