ఏపీ ఎంసెట్ ఫ‌లితాల్లో బాలిక‌ల‌దే పైచేయి

ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఎంసెట్)లో 91.27 శాతంతో బాలిక‌లే పైచేయి సాధించార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, కామినేని శ్రీ‌నివాస్‌లు తెలిపారు. ఎంసెట్లో బాలురు 87.48 శాతం ఉత్తీర్ణుల‌యిన‌ట్టు తెలిపారు. ఈ ఫ‌లితాల‌ను గురువారం వీరు విడుద‌ల చేశారు. ఇంజినీరింగ్‌లో 1,62,817 మంది హాజ‌ర‌య్యార‌ని, ఇందులో 1,41,143 మంది అర్హ‌త సాధించార‌ని చెప్పారు.       మెడిసిన్ కోసం ఎంట్ర‌న్స్ రాసిన విద్యార్థుల్లో 89.89 శాతం మంది, ఇంజినీరింగ్‌లో 77.42 శాతం మంది అర్హ‌త […]

Advertisement
Update:2015-05-20 18:40 IST
ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఎంసెట్)లో 91.27 శాతంతో బాలిక‌లే పైచేయి సాధించార‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు గంటా శ్రీ‌నివాస‌రావు, కామినేని శ్రీ‌నివాస్‌లు తెలిపారు. ఎంసెట్లో బాలురు 87.48 శాతం ఉత్తీర్ణుల‌యిన‌ట్టు తెలిపారు. ఈ ఫ‌లితాల‌ను గురువారం వీరు విడుద‌ల చేశారు. ఇంజినీరింగ్‌లో 1,62,817 మంది హాజ‌ర‌య్యార‌ని, ఇందులో 1,41,143 మంది అర్హ‌త సాధించార‌ని చెప్పారు.
మెడిసిన్ కోసం ఎంట్ర‌న్స్ రాసిన విద్యార్థుల్లో 89.89 శాతం మంది, ఇంజినీరింగ్‌లో 77.42 శాతం మంది అర్హ‌త సాధించార‌ని వారు తెలిపారు. వ‌చ్చేనెల 3, 4 తేదీల్లో మెడిసిన్, 12 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్ జ‌రుగుతుంద‌ని మంత్రులు తెలిపారు. ఇంజినీరింగ్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ అనిరుద్ద‌రెడ్డికి (157 మార్కులు), రెండో ర్యాంక్ అచ్యుత‌రెడ్డి 156, మూడో ర్యాంక్ జ్యోతి 156, నాలుగో ర్యాంక్ సందీప్ కుమార్ 155, అయిదో ర్యాంక్ ఆహ్వాన రెడ్డి 155, ఆరో ర్యాంక్ సాయి సందీప్ 154, ఏడోర్యాంక్ గార్ల‌పాటి శ్రీ‌కాంత్ 153, ఎనిమిదో ర్యాంక్ య‌శ్వంత్‌కుమార్ 153, తొమ్మిదో ర్యాంక్ ఓ అఖిల్, స‌లీం చ‌రిస్మా 153, ప‌దో ర్యాంక్ విద్యాసాగ‌ర నాయుడు, అనురూప్ 153 కైవ‌సం చేసుకున్నార‌ని మంత్రులు తెలిపారు. అలాగే మెడిసిన్‌లో కూడా 151 మార్కుల‌తో శ్రీ‌విధుల ఫ‌స్ట్ ర్యాంక్‌ను, సాయి భ‌ర‌ద్వాజ 151 రెండో ర్యాంకును, శ్రీ‌రామ దామిని మూడో ర్యాంకు, జ‌య హ‌రీష్ నాలుగో ర్యాంకు, అనీష్ గుప్తా ఐదో ర్యాంకు సాధించిన‌ట్టు వారు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News