ఎమ్మెల్సీ వ్యవహారం... దానం రాజీనామా
ఎమ్మెల్సీ ఎంపిక వ్యవహారం ‘గ్రేటర్’ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఆ మరుక్షణం… మాజీ మంత్రి, సీనియర్ నేత దానం నాగేందర్‌కు కోపమొచ్చింది. ఆయన గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు పంపించారు. ‘‘త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ […]
Advertisement
ఎమ్మెల్సీ ఎంపిక వ్యవహారం ‘గ్రేటర్’ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత పేరు ఖరారైంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఆ మరుక్షణం… మాజీ మంత్రి, సీనియర్ నేత దానం నాగేందర్‌కు కోపమొచ్చింది. ఆయన గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌కు పంపించారు. ‘‘త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో గ్రేటర్ పరిధిలోని నేతలను కాకుండా, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లలితను ఎంపిక చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనాలంటే ఎమ్మెల్సీ టికెట్ గ్రేటర్ పరిధి నేతలకు ఇచ్చి ఉంటే బాగుండేది’’ అని దానం తెలిపారు. అదే సమయంలో తాను ఆకుల లలితకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షబ్బీర్ అలీని శాసన మండలి పక్ష నేతగా నియమించారు. ఇప్పుడు మళ్లీ అదే జిల్లాకు ఎలా అవకాశమిస్తారు. కనీసం డి.శ్రీనివాస్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినా బాగుండేది. ఆయనపట్ల సీమాంధ్రులు కూడా సానుభూతితో ఉన్నారు. ఇది గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసి వచ్చేది’’ అని దానం అభిప్రాయపడ్డారు.
మరోవైపు… పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్యను తొలగించిన తీరును ఎండగట్టారు. ఓ పోలీసు అధికారిని బదిలీ చేసిన మాదిరి పొన్నాలని తొలిగించడం సరికాదని అన్నారు. మహిళకే టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నట్లయితే… సబితా ఇంద్రారెడ్డిని ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సబితా ఇంద్రారెడ్డికి గ్రేటర్ పరిధిలోని 12 మునిసిపాలిటీల్లో పట్టు ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల్లో ఏ మొహంతో తాము ఫైట్ చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం నుంచి తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తనను కూడా పట్టించుకోకుండా టికెట్ ఇచ్చేశారని చెప్పారు. తాను గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాత్రమే రాజీనామా చేశానని, కాంగ్రెస్ పార్టీకి చేయలేదని చెప్పారు.
Advertisement