ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇక ఏకగ్రీవమే
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా నలుగురే అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయం. తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశాలు ఉండడంతో ఒక స్థానం తెలుగుదేశం తన మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీకి ఇచ్చింది. ఈ పార్టీ నుంచి బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడు సోము వీర్రాజుకు ఛాన్స్ దక్కింది. టీడీపీ మిగిలిన […]
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా నలుగురే అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయం. తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశాలు ఉండడంతో ఒక స్థానం తెలుగుదేశం తన మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీకి ఇచ్చింది. ఈ పార్టీ నుంచి బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుడు సోము వీర్రాజుకు ఛాన్స్ దక్కింది. టీడీపీ మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎంఏ షరీష్‌కు, రెండోది ప్రతిభా భారతికి ఇచ్చింది. దీంతో వీరిద్దరూ గురువారం నామినేషన్ వేశారు. అలాగే బీజేపీ నుంచి సోము వీర్రాజు కూడా నామినేషన్ వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చిన గోవిందరెడ్డి బుధవారమే నామినేషన్ వేశారు. నాలుగు స్థానాలకు నలుగురు నామినేషన్లు వేయడంతో ఇక ఎన్నిక ప్రకటన లాంఛన ప్రాయమే.
Advertisement