స్మగ్లర్ బదానీకి 14 రోజుల రిమాండ్

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బదానీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కడప జిల్లా బద్వేలు కోర్టు న్యాయమూర్తి రాధారాణి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతడిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య, బద్వేలు సిఐ వెంకటప్ప నేతృత్వంలో బదానీని మంగళవారం ఉదయం కడప నుంచి బద్వేలుకు తీసుకువచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా అత‌ను ఆరోగ్యవంతుడుగా ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. కోర్టు సమయం ముగియడంతో రాత్రి 8 గంటల […]

Advertisement
Update:2015-05-19 18:50 IST
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బదానీకి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కడప జిల్లా బద్వేలు కోర్టు న్యాయమూర్తి రాధారాణి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతడిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య, బద్వేలు సిఐ వెంకటప్ప నేతృత్వంలో బదానీని మంగళవారం ఉదయం కడప నుంచి బద్వేలుకు తీసుకువచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా అత‌ను ఆరోగ్యవంతుడుగా ఉన్నాడని వైద్యులు నిర్ధారించారు. కోర్టు సమయం ముగియడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో బద్వేలు కోర్టు న్యాయమూర్తి రాధారాణి నివాసానికి తీసుకువచ్చారు. విచారించిన అనంతరం 14 రోజుల రిమాండ్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 9వ తరగతి వరకు చదువుకున్న ముఖేష్ మేస్ర్తిగా పనిచేస్తూ తదనంతరం రియల్ ఎస్టేటర్‌గా ఎదిగి ఆ తర్వాత స్మగ్లర్ అవతారమెత్తాడని తెలిపారు. తనకు భాగ్య ట్రేడింగ్ కంపెనీ ఉందని ముఖేష్ మీడియాకు చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. తిరుపతి, హైదరాబాద్‌కు చెందిన పలువురు స్మగ్లర్లతో బ‌దానీకి సంబంధాలు ఉన్నాయన్నారు. వీరితో ఎర్రచందనం లావాదేవీలు జరిపినట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. ఆ కోణంలో ముఖేష్‌ను సమగ్రంగా విచారిస్తే మరిన్ని వివరాలు బయటికి వస్తాయన్నారు. అనంతరం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
Tags:    
Advertisement

Similar News