గుంటూరులో ముగ్గురు బాలికలు అదృశ్యం!
గుంటూరులో ముగ్గురు బాలికలు ఆదృశ్యమయ్యారు. తమకు తగినంత స్వేచ్ఛ లభించడం లేదని, అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నామని వారు ఓ లేఖ రాసి వెళ్ళిపోయారు. దివ్య, ఉష, యశస్విని అనే ఈ ముగ్గురు బాలికలు ఈ నెల 14న చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి అదృశ్యమయిపోయారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఈ పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్‌లోని సీసీ కెమెరా […]
Advertisement
గుంటూరులో ముగ్గురు బాలికలు ఆదృశ్యమయ్యారు. తమకు తగినంత స్వేచ్ఛ లభించడం లేదని, అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నామని వారు ఓ లేఖ రాసి వెళ్ళిపోయారు. దివ్య, ఉష, యశస్విని అనే ఈ ముగ్గురు బాలికలు ఈ నెల 14న చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి అదృశ్యమయిపోయారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఈ పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా అ దృశ్యాల్లో వీరి జాడ కనిపించింది. ఈ ముగ్గురి పిల్లలతోపాటు మరో అమ్మాయి కూడా వారితో ఉన్నట్టు స్పష్టమైంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి గాలింపుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మూడుగా విడిపోయి చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌లకు బయలుదేరాయి. వీరిని ఎక్కడికి తరలించారు? లేదా వీరే ఎక్కడికైనా వెళ్ళిపోయారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement