చైనాలో యోగా కళాశాలకు లీ ఆమోదం
ప్రధాని మోదీ చైనా పర్యటన ఆ దేశంలో భారతీయ యోగా వ్యాప్తికి మార్గం సుగమం చేసింది. తన చైనా పర్యటనలో ఆ దేశ ప్రధాని లీతో కలిసి మోదీ యోగా-థాయ్‌చీ సంయుక్త ప్రదర్శనకు హాజరయ్యారు. ఇక్కడ భారతీయ విద్యార్థుల యోగా ప్రదర్శన లీని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆయన యోగాభ్యాసనను అధికారికంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. యునాన్ విశ్వవిద్యాలయంలో యోగా కళాశాల స్థాపనకు ఆమోదముద్ర వేశారు. కాగా, చైనా ప్రధాని లీతో కలిసి మోదీ దిగిన సెల్ఫీకి 3.18 […]
Advertisement
ప్రధాని మోదీ చైనా పర్యటన ఆ దేశంలో భారతీయ యోగా వ్యాప్తికి మార్గం సుగమం చేసింది. తన చైనా పర్యటనలో ఆ దేశ ప్రధాని లీతో కలిసి మోదీ యోగా-థాయ్‌చీ సంయుక్త ప్రదర్శనకు హాజరయ్యారు. ఇక్కడ భారతీయ విద్యార్థుల యోగా ప్రదర్శన లీని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఆయన యోగాభ్యాసనను అధికారికంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. యునాన్ విశ్వవిద్యాలయంలో యోగా కళాశాల స్థాపనకు ఆమోదముద్ర వేశారు. కాగా, చైనా ప్రధాని లీతో కలిసి మోదీ దిగిన సెల్ఫీకి 3.18 కోట్ల లైక్‌లు వచ్చాయి. చైనా సామాజిక మీడియా వీబోలో ఈ సెల్ఫీని అప్‌లోడ్ చేయగా భారీ స్పందన లభించింది. చైనా పర్యటన సందర్భంగా మోదీ వీబో ఖాతాను తెరిచిన విషయం విదితమే. ఆయనకు 1.65 లక్షల మంది ఫాలోయర్లు లభించారు.
Advertisement