అండర్ వాటర్ బార్... ఓ చక్కటి అనుభూతి!
మెక్సికోలోని కోజుమెల్ ద్వీపంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రారంభించిన ‘అండర్ వాటర్ బార్’ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. బార్ అంటే మనవాళ్లు మందుకొట్టే లాంటిది కాదండోయ్. ఇది, సుమారు 60వేల లీటర్లను నింపిన అక్వేరియం తరహా గాజు గది. ఇందులోకి ప్రవేశించాలంటే ప్రత్యేకంగా రూపొందించిన హెల్మెట్ ధరించాలి. దానికున్న ప్రత్యేక వ్యవస్థ ద్వా రా, మింట్, సిట్రస్ ఫ్లేవర్‌లతో ఆక్సిజన్ విడుదలవుతూ ఉంటుంది. ఆ మజాను అనుభవిస్తూ, నీటిగది లాంజ్‌లో కలియ తిరగొచ్చు. అక్కడే బోర్డు గేమ్స్ ఆడొచ్చు. […]
Advertisement
మెక్సికోలోని కోజుమెల్ ద్వీపంలో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రారంభించిన ‘అండర్ వాటర్ బార్’ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. బార్ అంటే మనవాళ్లు మందుకొట్టే లాంటిది కాదండోయ్. ఇది, సుమారు 60వేల లీటర్లను నింపిన అక్వేరియం తరహా గాజు గది. ఇందులోకి ప్రవేశించాలంటే ప్రత్యేకంగా రూపొందించిన హెల్మెట్ ధరించాలి. దానికున్న ప్రత్యేక వ్యవస్థ ద్వా రా, మింట్, సిట్రస్ ఫ్లేవర్‌లతో ఆక్సిజన్ విడుదలవుతూ ఉంటుంది. ఆ మజాను అనుభవిస్తూ, నీటిగది లాంజ్‌లో కలియ తిరగొచ్చు. అక్కడే బోర్డు గేమ్స్ ఆడొచ్చు. దాదాపు 20 నిమిషాల పాటు మధురానుభూతిని అందించే ఈ బార్‌లోకి ప్రవేశించాలంటే భారతీయ కరెన్సీలో రూ 2,500లు చెల్లించాల్సి ఉంటుంది. సరదాగా ఫోటోలు తీయించుకోవాలనుకుంటే మరో రూ.1400 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement